‘జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసినట్లు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసింది ఎవరు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందో? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి’. త్రివిక్రమ్ ‘అతడు’ సినిమా కోసం ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్‌కి రాసిన వైరల్ డైలాగ్ ఇది. లేటెస్ట్గా హీరోయిన్ త్రిష ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ చదివాక ఇదే డైలాగ్ ని నెమరు వేసుకుంటున్నారు నెటిజన్లు.
వివరాల్లోకి వెళితే.. 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకుంది త్రిష. అయితే ఆ బంధం వారాల్లోనే బీటలు వారింది. కారణాలు ఏమిటో గానీ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి జోలికి పోలేదు. అప్పటినుంచి సోలోగానే ఉంది. అయితే ఆమెపై వచ్చే రూమర్స్‌కి మాత్రం కరవు లేదు. ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ త్రిష మాత్రం పెదవి విప్పదు.
లేటెస్ట్గా హీరో విజయ్, త్రిషని ముడిపెడుతూ రూమర్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. త్రిష, విజయ్ డేటింగ్లో ఉన్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ పర్సనల్ ఫోటోని షేర్ చేసింది త్రిష. ఆ ఫోటోలో విజయ్ సోఫాలో త్రిష పక్కన కూర్చుని ఆమె పెట్ డాగ్‌తో ఆటలాడుతు కనిపించారు. త్రిష మాత్రం విజయ్ను చూసి మురిసిపోయినట్టు కనిపించింది.
ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు “మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎప్పటికీ టైమ్‌లెస్” అంటూ మెచ్చుకుంటే, “ఇలాంటి ఫోటోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావ్? విజయ్ గారిని ఆయన భార్య సంగీతతో చాలాకాలంగా చూడలేదు. ఇలాంటి ప్రైవేట్ మూమెంట్స్ షేర్ చేయడం అవసరమా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఓ క్రిప్టిక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీని త్రిష షేర్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొందరిని తికమక చేస్తుంది’ అనే అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. డేటింగ్ రూమర్లు చక్కర్లు కొడుతున్న సందర్భంలో త్రిష ఇలాంటి ప్రేమ పోస్ట్ పెట్టడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.
ఇప్పుడే కాదు, త్రిష ఎప్పుడూ అంతే. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ స్పష్టంగా చెప్పదు. తను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పైన చెప్పిన జ్యోతిలక్ష్మి డ్యాన్స్లానే ఉంటాయి తప్ప క్లారిటీ ఉండదు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. నాలుగు పదులు వయసు దాటినా త్రిష జోరు తగ్గలేదు. ఇటివలే థగ్ లైఫ్ చేసింది. చిరు విశ్వంభర, సూర్య కరప్పు సినిమాల్లో ఆమెనే హీరోయిన్. ఇవి కాకుండా కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ తో కూడా బిజీగా వుంది.