చిరు ప‌క్క‌న త్రిష‌… చూడ‌గ‌ల‌మా?

చిరంజీవి 152వ సినిమాలో క‌థానాయిక‌గా త్రిష పేరు దాదాపుగా ఖాయ‌మైపోయింది. న‌య‌న‌తార‌, అనుష్క, త‌మ‌న్నా లాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా – కొర‌టాల మాత్రం త్రిష వైపుకు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. న‌య‌న ఇది వ‌ర‌కే చిరుతో జోడీ కట్టింది. పైగా న‌య‌న కాల్షీట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. పారితోషికం కూడా బాగా డిమాండ్ చేస్తోంది. ఇక త‌మ‌న్నా ఇప్ప‌టికే `సైరా`లో చిరు ప‌క్క‌న క‌నిపించింది. అనుష్క కాల్షీట్ల కోసం కొంత కాలం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఈ ద‌శ‌లో త్రిష అయితే అన్ని విధాలుగా బాగుంటుంద‌ని కొర‌టాల భావిస్తున్నాడు.

అయితే చిరు – త్రిష అన‌గానే ‘స్టాలిన్’ గుర్తొస్తుంది. అందులో చిరు బాగా లావుగా, త్రిష మ‌రీ స‌న్న‌గా క‌నిపించింది. చిరు జోడీల్లో కాస్త ఇబ్బందిగా క‌నిపించిన సంద‌ర్భం ఇదే. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పేమీ రాలేదు. చిరు అలానే లావుగా ఉంటే, త్రిష మ‌రింత స‌న్న‌బ‌డింది. సో.. ఇప్ప‌టికీ ఈ కాంబో ఆర్డ్ గానే ఉంటుంది. కానీ కొర‌టాల శివ ముందు మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. చిరంజీవికి క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంపిక చేసుకోవ‌డం అంత‌గా ఇష్టం లేద‌ని, అయితే కొర‌టాల నిర్ణ‌యాన్ని చిరు గౌర‌వించ‌డం వ‌ల్ల ఈ కాంబో మ‌రోసారి తెర‌పైకి రాబోతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. మ‌రి ఈసారి.. ఈ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

HOT NEWS

[X] Close
[X] Close