మ‌హేష్ బాబు – సందీప్ రెడ్డి.. సినిమా లేన‌ట్టే!

అర్జున్ రెడ్డి త‌ర‌వాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాల‌ని చాలామంది స్టార్ హీరోలు భావించారు. అందులో మ‌హేష్ బాబు ఒక‌డు. మ‌హేష్ – సందీప్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. వీరిద్ద‌రి కాంబో దాదాపుగా ఖాయ‌మ‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఈ కాంబో ఇక లేన‌ట్టే. సందీప్ రెడ్డితో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న మ‌హేష్ విర‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. దానికి కార‌ణం.. క‌థేన‌ట‌.

సందీప్ చెప్పిన క‌థ మ‌హేష్‌కి న‌చ్చింది గానీ, ద్వితీయార్థంలో కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్‌. సందీప్‌రెడ్డి ది కాస్త మొండి వైఖ‌రి. ఎవ‌రి కోస‌మో క‌థ మార్చుకోడు. అర్జున్ రెడ్డి క‌థ‌ని కూడా చాలామంది హీరోలు తిర‌స్క‌రించారు. అందులో మార్పులు చేర్పులు చెప్పారు. ఎవ‌రి మాట‌కూ త‌లొగ్గ‌క‌… తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తీయ‌డానికి ఆ సినిమా కోసం తానే నిర్మాత‌గా మారాడు. అందుకే అంత‌టి స‌క్సెస్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డి హిట్ట‌వ్వ‌డం, అది బాలీవుడ్ లో తెర‌కెక్కించి దాన్ని కూడా సూప‌ర్ హిట్ చేయ‌డంతో సందీప్ రేంజు మ‌రింత పెరిగింది. ఇలాంటి స్థితిలో హీరో కోసం క‌థ‌ని మార్చేందుకు సందీప్ ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే… ఈ ప్రాజెక్టు నుంచి సందీప్ కూడా త‌ప్పుకున్నాడు. సందీప్‌తో సినిమా స్థానంలో ప్ర‌శాంత్ నీల్ (కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు)ని తీసుకొచ్చాడు మ‌హేష్‌. పైగా ఇప్పుడు సందీప్ కి తెలుగు సినిమాలు చేయాల‌ని కూడా లేదు. త‌న దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మళ్లీ టీడీపీ – బీజేపీ పొత్తు మాట..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీవారంతంలో తను రాసే ఆర్టికల్ " కొత్తపలుకు"లో ఇటీవల గాఢత తగ్గింది. ఏపీ సర్కార్‌పై... తెలంగాణ సర్కార్‌పై గతంలో ఆయన విరుచుకుపడే తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు...

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్...

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

HOT NEWS

[X] Close
[X] Close