అవును… స‌మంత కోస‌మే తీశారు

అ.ఆ ఎప్పుడైతే మొద‌లైందో.. ఇది స‌మంత కోసం త్రివిక్ర‌మ్ తీస్తున్న సినిమా అన్న ప్ర‌చారం ఓ రేంజులో సాగింది. ఆఖ‌రికి స‌మంత ఇంట‌ర్వ్యూల‌లోనూ ఇదే ప్ర‌శ్న‌. కానీ స‌మంత మాత్రం ‘అలాంటిదేం లేదు.. ఈ సినిమాలో అన్ని పాత్ర‌లూ స‌మాన‌మే’ అంది. కాక‌పోతే ఈ సినిమా చూశాక మాత్రం.. స‌మంత చాలా ఎక్కువ స‌మానం అనిపిస్తుంది. ఎందుకంటే.. అ.ఆ పూర్తిగా స‌మంత క్యారెక్ట‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి సాగే సినిమా. ఆమె చుట్టూ అల్లుకొన్న పాత్ర‌లు, సంఘ‌ట‌న‌లు, స‌న్నివేశాలే. కాబ‌ట్టి స‌మంత డామినేష‌నే ఎక్క‌వ‌గా క‌నిపించింది. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చింపేస్తుంది… ఆమె పాత్ర‌ని అంత తేలిగ్గా మ‌ర్చిపోరు.. జూ.సూరేకాంతం అంటారు.. అంటూ ఏవేవో చెప్పారు గానీ.. అంత హంగామా ఏం క‌నిపించ‌ద‌క్క‌డ‌. అస‌లు ఆ పాత్ర‌కి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌నే అవ‌స‌రం లేదు. ఎవ‌రైనా ఓకే.

అంతెందుకు నితిన్‌ని కూడా స‌మంత క్యారెక్ట‌ర్ డామినేట్ చేసింది. దాంతో ఈ సినిమా స‌మంత కోస‌మే తీశార‌న్న అనుమానాలు నిజ‌మ‌య్యాయి. అయితే త్రివిక్ర‌మ్ తెలివంతా ఎక్క‌డుందంటే… ఆడియ‌న్‌కి అదేం గుర్తుకు రాకుండా మ్యాజిక్ చేశాడు. కాక‌పోతే ఇప్ప‌డు కాక‌పోయినా కొన్నాళ్ల‌కైనా అ.ఆ స‌మంత సినిమాగానే మిగిలిపోతుంది. ఇది ఖాయం. ఎందుకంటే ఆ పాత్ర‌లో స‌మంత అంత బాగా న‌టించింది కాబ‌ట్టి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com