ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్ర‌మ్

ఈ రోజు త్రివిక్ర‌మ్ పుట్టిన రోజు. ట్విట్ట‌ర్‌లో అదే ట్రెండింగ్ న‌డుస్తోంది. అయితే ఈ పుట్టిన రోజున త్రివిక్ర‌మ్ కొత్త సినిమా సంగ‌తులేమైనా తెలుస్తాయేమో అని ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే అవేం చెప్ప‌కుండా.. ఈ పుట్టిన రోజున చ‌ప్ప‌గా సాగ‌నంపారు. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓసినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబో ఎప్పుడో ఫిక్స‌య్యింది. అయితే ఆ త‌ర‌వాత ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. షూటింగ్ సంగుతులు చెప్ప‌డం గానీ, టైటిల్ బ‌య‌ట పెట్ట‌డం గానీ జ‌ర‌గ‌లేదు. ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ గురించి అభిమానులు ఎదురు చూస్తున్నార‌ని తెలుసు… మంచి త‌రుణంలో మేమే అప్ డేట్ ఇస్తాం.. అని నిర్మాణ సంస్థ కూడా ఇది వ‌ర‌కే చెప్పింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి అప్ డేట్ లు ఏమీ లేవు.

ఎన్టీఆర్ సినిమా చేసేలోగా.. త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేస్తున్నాడ‌ని, అందుకోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లొచ్చాయి. క‌నీసం వీటిపై అయినా క్లారిటీ ఇవ్వాల్సింది. `అయిన‌నూ పోవ‌లె హ‌స్తిన‌కు` అనే టైటిల్ ఒక‌టి ప్ర‌చారంలో ఉంది. దాన్న‌యినా ఖాయం చేయాల్సింది, లేదంటే కొత్త టైటిల్ చెప్పాల్సింది. ఇవేం.. క‌నిపించ‌క‌పోయే స‌రికి, షూటింగ్ అప్ డేట్ లేక‌పోయే స‌రికి.. ఎన్టీఆర్ అభిమానులు కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎదురు చూపుల‌కు, నిరీక్ష‌ణ‌కు త్రివిక్ర‌మ్ ఎప్పుడు తెర దించుతాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతీ యాభై ఇళ్లకు వైసీపీ తరపున ఇంకొకరు నిఘా !

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం పన్నులుగా కట్టిన సొమ్మును ఇస్తూ.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వ్యక్తిని నియమించింది. వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ...

“వారాహి” రంగు మార్చక తప్పదా !?

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి హాట్ టాపిక్ అయింది. యుద్ధ ట్యాంక్‌ను పోలి ఉండటం.. సేనాని ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉండటంతో ఈ వాహనం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే...

ముద్ర పడింది – టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ పంపింది. కేసీఆర్ ఈ లేఖను...

షూటింగులు బంద్.. అట్టర్ ఫ్లాఫ్ షో

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలని పరిష్కరించడానికి నిర్మాతలు అంతా కలసి షూటింగ్ బంద్ కి పిలుపునిచ్చారు. దాదాపు ముఫ్ఫై రోజులు షూటింగులు నిలిపివేశారు. తాజాగా నిర్మాత కళ్యాణ్ ఈ షూటింగ్ బంద్ ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close