సెంటిమెంట్స్ వ‌దిలేసిన మ‌హేష్‌, త్రివిక్ర‌మ్‌

చిత్ర‌సీమ‌లో సెంటిమెంట్స్ ఎక్కువ‌. ముఖ్యంగా టైటిల్స్ విష‌యంలో అక్ష‌రాలు, అంకెల‌కు ప్రాధాన్యం ఉంటుంది. త్రివిక్ర‌మ్ కి ‘అ’ సెంటిమెంట్‌. ఆయ‌న సినిమా పేర్ల‌న్నీ దాదాపుగా `అ`తో మొద‌ల‌య్యేవే. ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. మ‌హేష్ బాబుకీ ఇలాంటి సెంటిమెంటే ఉంది. ఆయన టైటిల్స్ ఎక్కువ‌గా మూడ‌క్ష‌రాల‌తో సాగేవే. ఇది కూడా హిట్లు ఇచ్చింది. అందుకే వీరిద్ద‌రూ క‌లిసి, ముచ్చ‌ట‌గా చేస్తున్న మూడో సినిమా పేరు ఏమై ఉంటుందా? అనే ఆసక్తి రేగింది. ‘అయిన‌నూ పోవ‌లె హ‌స్తిన‌కు’, ‘అమ‌రావ‌తికి అటూ ఇటూ’ లాంటి పేర్లు ప‌రిశీలించి చివ‌రకు `గుంటూరు కారం` అనే పేరు ఖ‌రారు చేశారు.

మ‌హేష్ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ పెడ‌తార‌న్న వార్త రాగానే ఎవ‌రూ పెద్ద‌గా న‌మ్మ‌లేదు. ఎందుకంటే అటు త్రివిక్ర‌మ్ ‘అ’ సెంటిమెంట్ కీ, ఇటు.. మ‌హేష్ మూడ‌క్ష‌రాల సెంటిమెంట్ కీ ఈ టైటిల్ చాలా దూరంగా ఉంది. క‌నీసం ‘అమ‌రావ‌తికి అటూ ఇటూ’ అనే పేరు ఫిక్స్ చేస్తార‌ని అనుకొన్నారు. కానీ గుంటూరు కార‌మే పోస్ట‌ర్ పై క‌నిపించింది. అంటే.. త్రివిక్ర‌మ్, మ‌హేష్ త‌మ సెంటిమెంట్ల‌ని ప‌క్క‌న పెట్టేశార‌న్న‌మాట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకీ టైటిల్ నిర్ణ‌యించింది త్రివిక్ర‌మే. ఆయ‌న ఆ చిత్రానికి ‘బ్రో’ అనే పేరు పెట్టాడు. అక్క‌డా అ సెంటిమెంట్ పాటించ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close