మ‌హేష్ కోసం త్రివిక్ర‌మ్ త‌హ‌త‌హ‌

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్.. వీళ్ల‌ద్ద‌రిదీ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. అత‌డు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌దు. ఖ‌లేజా బాక్సాఫీసు ద‌గ్గ‌ర రాణించ‌లేక‌పోయినా – మ‌హేష్‌లోని ఓ స‌రికొత్త బాడీ లాంగ్వేజీని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. వెండి తెర‌పై కాక‌పోయినా బుల్లి తెర‌పై అది సూప‌ర్ హిట్ అనుకోవాలి. వీరిద్ద‌రి నుంచి మూడో సినిమా కోసం మ‌హేష్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందుకు ముహూర్తం ముంచుకొస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌హేష్‌తో ఓ సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ కూడా త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. మ‌రోవైపు మ‌హేష్ కూడా అంతే. ఈమ‌ధ్య వీరిద్ద‌రూ క‌ల‌సి ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న చేశారు. అప్పుడే మూడో సినిమా గురించి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంలోనే మ‌హేష్‌కి త్రివిక్ర‌మ్ ఓ లైన్ చెప్పాడ‌ని, అది మ‌హేష్‌కి బాగా న‌చ్చింద‌ని స‌మాచారం. కాక‌పోతే.. అటు మ‌హేష్‌, ఇటు త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ బిజీనే. త్రివిక్ర‌మ్ ముందుగా బ‌న్నీ సినిమాని పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాత చిరంజీవితో క‌మిట్‌మెంట్ ఉంది. ఇవి రెండూ పూర్తి చేశాకే మ‌హేష్ సినిమా ఉండొచ్చు. మ‌రోవైపు అనిల్ రావిపూడి సినిమా ఒప్పుకున్నాడు మ‌హేష్‌. ఈలోగా కొత్త క‌థలు కూడా వింటున్నాడు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే 2020లో వీరిద్దరి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close