అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది. బన్నీ ప్లేస్‌లో ఎన్టీఆర్ తో ప్రొసీడ్ అవుతున్నారు త్రివిక్రమ్. అట్లీ సినిమా తరవాత బన్నీ కూడా మరో ఆప్షన్ చూసుకోవాలి. ఎప్పుడైతే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యిందని వార్తలొచ్చాయో, అప్పుడే బన్నీ తదుపరి సినిమాపై కూడా చర్చలు మొదలైపోయాయి. అట్లీ సినిమా పూర్తయ్యాక ఏం చేయాలన్న విషయంలో బన్నీ ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.
ఈసారి కూడా బన్నీ పరభాషా దర్శకుడితో పని చేసే అవకాశం ఉంది. రేసులో `జైలర్` ఫేమ్ నెల్సన్ ముందు వరుసలో ఉన్నారు. నెల్సన్‌తో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు నడిచినట్టు టాక్. మరోవైపు మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. `మిన్నల్ మురళి` లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు బాసిల్. తనో డిఫరెంట్ ఐడియాతో బన్నీని కలిసినట్టు తెలుస్తోంది. బన్నీకి ఎప్పటి నుంచో ఓ పూర్తిస్థాయి మలయాళం సినిమా చేయాలని వుంది. ఆ కోరిక ఈ కథతో తీరబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అట్లీ సినిమా తరవాత బన్నీ చేసే సినిమా నూటికి నూరు శాతం గీతా ఆర్ట్స్ లోనే. అది దర్శకుడు ఎవరైనా కావొచ్చు. ప్రస్తుతానికి ఈ రెండు కథలపై బన్నీ ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.