సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అంటే.. అది త్రివిక్రమ్ సినిమాలానే లెక్క. కథ దగ్గర్నుంచి, ఫైనల్ అవుట్ పుట్ వరకూ ఆయన ప్రమేయం ఉంటుంది. ఎడిట్ టేబుల్ దగ్గర కూడా ఆయన నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి. సితార నుంచి రాబోతున్న మరో సినిమా ‘ఫంకీ’. అనుదీప్ దర్శకుడు. విశ్వక్ సేన్ హీరో. రేపు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా అవుట్ పుట్ పై సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సినిమా చూసి.. ఆయన కొన్ని మార్పులు చేర్పులూ చెప్పార్ట. లెంగ్త్ తగ్గించడానికి త్రివిక్రమ్ చెప్పిన సూచనలు పని చేశాయని సమాచారం. రెండు మూడు సన్నివేశాలు ట్రిమ్ చేయాలని త్రివిక్రమ్ సూచించారని, దానికి తగ్గట్టే రన్ టైమ్ తగ్గించారని తెలుస్తోంది.
విశ్వక్ సేన్‌కి ఈ సినిమా చాలా కీలకం. తను కూడా ఈ సినిమాపై చాలా నమ్మకమే పెట్టుకొన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఉన్న గురితో.. ఓటీటీ డీల్ కూడా కుదిరిపోయింది. నాన్ థియేట్రికల్ నుంచి దాదాపు రూ.13 కోట్ల వరకూ వచ్చాయని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.9 కోట్లకు ఓటీటీ డీల్ కుదుర్చుకొంది. థియేటర్ నుంచి మరో రూ.10 కోట్లు వచ్చినా సినిమా గట్టేక్కిసినట్టే. విశ్వక్సేన్ సినిమా హిట్ టాక్ వస్తే వసూళ్లు బాగానే ఉంటాయి. పైగా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఇప్పుడు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఫంకీకి మంచి టాక్ వస్తే… సితార ఖాతాలో మరో మంచి కమర్షియల్ హిట్ పడినట్టే.
