గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటడంతో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. 17బంతుల్లోనే హాఫ్ సెంచరీ , 35 బంతుల్లోనే సెంచరీ బాదడంతో వైభవ్ పై ప్రశంసల జల్లు కురుస్తుండగా… విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ కొనసాగుతోంది.
అతి చిన్న వయస్సులోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, పిన్న వయస్కులోనే సెంచరీ చేసిన బ్యాట్స్ మెంట్ గా కొత్త రికార్డ్ లను క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఈ ఐపీఎల్ సీజన్ లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డ్ నెలకొల్పాడు. ఇదే విరాట్ ను ట్రోల్ చేసేందుకు కారణమైంది.
ఈ సీజన్ లో ఎక్కువ బంతులు ఆడి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా కోహ్లీ ఖాతాలో ఓ బ్యాడ్ రికార్డ్ ఉంది. 45 బంతులు ఆడి 50 పరుగులు చేశాడు. టీ20లో యాభై పరుగులు చేసేందుకు 45 బంతులు తీసుకోవడం , అదీ స్టార్ బ్యాట్స్ మెన్ కావడంతో విరాట్ ను ట్రోల్ చేస్తున్నారు.
కానీ, విరాట్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాట్ ను ఝులిపిస్తాడనేది ఓపెన్ సీక్రెట్. క్రికెట్ లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ బ్యాట్స్ మెన్ అయినా పిచ్ కండిషన్స్ కు లోబడే ఆడుతారు. కోహ్లీ కూడా వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టు విజయం కోసం ఎక్కువ బంతులు తీసుకున్నాడని, అంతమాత్రానా విరాట్ ఆటను, వైభవ్ ఆటను పోల్చి ట్రోల్ చేయడం ఏమాత్రం సరైంది కాదని కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.