కేటీఆర్ బర్త్‌డే..! టీఆర్ఎస్ ధూం..ధాం..!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అధికార పార్టీకి భవిష్యత్ నేతగా ఉన్న ఆయన పుట్టినరోజును.. ధూంధాంగా సెలబ్రేట్ చేస్తున్నారు. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలను పార్టీ నేతలు ఇచ్చారు. టీవీ చానల్స్‌తో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ట్రెండింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలందరూ పండుగలా చేసుకుంటున్నారు. కొంత మంది ప్రకటనలు ఇస్తే.. మరికొంత మంది .. రక్తదాన శిబిరాలు పెడుతున్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో డబ్బులు దుబారా చేయవద్దని.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చినా… పార్టీ నేతలు మాత్రం .. తాము చేయాలనుకున్నది చేస్తున్నారు.

నిజానికి ఈ సారి ఇంత భారీగా పుట్టినరోజు వేడుకలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి సారి వచ్చిన పుట్టిన రోజు కాదు. కానీ కేటీఆర్ సీఎం అనే అంచనా ఈ ఏడాది అమల్లోకి వస్తుందని గట్టిగా టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నట్లుగా ఉన్నారు. కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవాలనుకున్న వారు.. కొత్తగా మంత్రి పదవిని పొందాలనుకున్న వారు.. ఇలా అనేక మంది అనేక రకాలుగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

ఒక్క రాజకీయవర్గాల నుంచే కాకుండా.. ఇతరుల నుంచి కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామోజీరావు వంటి ప్రముఖులుకూడా ఆయన గొప్ప పదవులు అలంకరించాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. టీఆర్ఎస్ లో ఈ ఉత్సాహం చూస్తూంటే.. కేటీఆర్‌ ఖచ్చితంగా సీఎం అయ్యే క్షణం ఎంతో దూరంలో లేదని.. అంచనా వేస్తున్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని తగ్గించాలని కేటీఆర్ కూడా అనుకోవడం లేదు కానీ.. వీలైనంత వరకూ వారిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వంద ట్రై స్కూటర్లనును వికలాంగులకు పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలకూ అలాంటి సలహాలే ఇచ్చారు. మొక్కలు నాటాలని కోరారు. ఈ సేవా కార్యక్రమాలపై ఎంత మంది టీఆర్ఎస్ నేతలు దృష్టి పెడతారో మాత్రం చెప్పలేం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close