టీఆర్ఎస్‌కు చేవెళ్ల ఎంపీ రాజీనామా..!

తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ కు పంపారు. కొద్ది రోజుల క్రితం… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. చేతనైతే ఆపుకోవాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. ఆ వెంటనే మీడియాలో ఆ ఇద్దరు ఎంపీలు.. కొండా విశ్వేవర్ రెడ్డి, సీతారామ్ నాయక్ అంటూ ప్రచారం జరిగింది. వీరిద్దర్ని.. కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించి బుజ్జగించారు. అప్పట్లో ఇద్దరూ పార్టీని వీడటం లేదని ప్రకటించారు.

పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్న విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎ‌స్ కు గుడ్‌బై చెబుతున్నారనే ప్రచారంతో ఆయనను బుజ్జగించేందుకు కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ గంట సేపు ఆయనతో మాట్లాడారు. కేటీఆర్‌తో భేటీకి వెళ్లేటప్పుడే విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రగతి భవన్‌లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే వెంటనే రాజీనామా చేయాలని ఆనుకున్నారు. అయితే మంత్రి కేటీఆర్‌ ఎన్నికల సమయంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని అభ్యర్థించారు. మీకు పార్టీలో ఎవరితోనైనా ఇబ్బందులు ఉంటే తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. దాంతో .. విశ్వేశ్వర్‌ రెడ్డి తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.

కేటీఆర్ తో భేటీ తర్వాత టీఆర్ఎ‌స్ లో కొనసాగుతానని కాని.. కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తాననే మాట కానీ చెప్పలేదు. అయినా సరే.. విశ్వేశ్వర్ రెడ్డి రెండు రోజుల్లోనే… టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి… వ్యవహారశైలి.. పార్టీలో ఆయనకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తూండటంతో.. బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు పంపిన రాజీనామా లేఖలో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఐదు అంశాలపై పార్టీలో తాను ఇబ్బందులు గురయినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా గౌరవం లేకపోవడం, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోవడం వంటి ఆంశాలను చెప్పుకొచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారిని పెద్ద పదవులు ఇచ్చారని అసంతప్తి వ్యక్తం చేశారు. లోక్ సభకు కూడా రాజీనామా చేస్తున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేఖలో తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు.. కాంగ్రెస్ లో చేరుతారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మిగతా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ మారడం లేదని తేల్చేసిన పర్చూరు ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు....

జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ...

బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని... నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు....

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

HOT NEWS

[X] Close
[X] Close