కారు టాప్ గేర్..! పరిషత్ పోరులో వన్ సైడ్ వార్..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురులేకుండాపోయింది. అన్ని జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. కారు స్పీడ్‌ ధాటికి.. కాంగ్రెస్ అభ్యర్థులు కకావికలం అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 3 వేల 555 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 13 వందల 77, బీజేపీ 211, టీడీపీ 21 స్థానాలను కైవసం చేసుకున్నాయి. 571 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. అటు జడ్పీటీసీ ఫలితాల్లోనూ కారు జోరే కనిపిస్తోంది. మొత్తం 538 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు 418 జడ్పీటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 61, బీజేపీ 7, ఇతరులు 4 స్థానాల చొప్పున గెలుపొందారు.

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క జిల్లాలోనూ జడ్పీ పీఠాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు. అలాగే.. 80శాతం మండల పరిషత్ పీఠాలు కూడా.. టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో.. భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ పార్టీకి… ఈ ఎన్నికలు ఓ రకంగా షాక్‌ లాంటివే. గ్రామాల్లో ఒకప్పుడు తిరుగులేని విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఆ స్థానాన్ని టీఆర్ఎస్‌కు వదిలేసుకున్నట్లయింది.

పార్టీ పరంగా టీఆర్ఎస్‌ సత్తా చాటినా ముఖ్య నేతలకు చెందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి షాక్‌ తప్పడం లేదు. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామంలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్‌ జిల్లా చినముల్కనూర్‌ ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి రాజేశం గెలుపొందారు. కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితకు మరోసారి బీజేపీ షాక్‌ ఇచ్చింది. ఆమె స్వగ్రామమైన నవీపేట మండలం పోతంగల్‌లో కూడా టీఆర్ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై 86 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కె.రాజు గెలుపొందారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close