మునుగోడులో కాంగ్రెస్ కు మేలు చేసేలా టీఆర్ఎస్ ప్లాన్ !?

” మునుగోడు ఉపఎన్నిక చిన్నదే. దాని వల్ల వచ్చేదేం ఉండదు.. పోయేదేం ఉండదు ” అని మంత్రి కేటీఆర్ ఇటీవల నెటిజన్లతో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయలోనూ ఆయన ఇదే చెప్పారు. ఆశల్లేకపోతేనే ఆయన ఇలా చెబుతారన్న అభిప్రాయం ఈ కారణంగానే బలపడుతోంది. మునుగోడులో టీఆర్ఎస్‌కు అవకాశాలు ఉన్నా లేకపోయినా.. ఆ పార్టీ రాజకీయ వ్యూహం మాత్రం భిన్నంగా ఉంటుందన్న చర్చలు సాగుతున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఓట్లు ఏకపక్షంగా ఎవరికైనా పడితే టీఆర్ఎస్‌కు ఇబ్బంది. చీలిపోతే ఏకపక్షంగా మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది రాజకీయ పండితులు చెప్పే మాట. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికతో తాము గెలవకపోయినా… గెలిచే మార్గం టీఆర్ఎస్ ఎదుట కనిపిస్తోంది. అదే ఓట్ల చీలిక. మునుగోడులో సంప్రదాయంగా బీజేపీకి.. టీఆర్ఎస్‌కు బలం లేదు. అది కమ్యూనిస్టులు.. కాంగ్రెస్‌ల పోరుబరి. ఇప్పుడు కోమటిరెడ్డి కారణంగా బీజేపీ వస్తోంది.

కోమటిరెడ్డికి ఉన్న ఇమేజ్ ప్రకారం చూసినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన వెంట తక్కువ మంది వెళ్లడం వంటి పరిణామాలు చూసినా .. మునుగోడు బీజేపీకి పెనుసవాలే. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి మెరుగు. తెలంగాణ అధికార పార్టీగా టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్. ఇలాంటి సమయంలో రాజకీయ వ్యూహాన్ని మార్చి.. పోరును కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య పరిమితం చేస్తే బీజేపీ లాసైపోతుంది. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయ సెంటిమెంట్ మారుతుంది. ఒక వేళ మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్‌కు పెద్ద గండం పొంచి ఉంటుంది.

అందుకే కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో తన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ కు కూడా ఎంతో మేలు చేసినట్లవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడూ తామే లాభం పొందాలనుకోలేరు.. ఎదుటి పార్టీకి మేలు చేయడం ద్వారా కూడా తాము లాభపడతారు. ఇలాంటి రాజకీయాల్లో కేసీఆర్ ఆరి తేరిపోయారు. అందుకే ఆయన నిర్ణయాలపై ఆసక్తి ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close