మజ్లిస్‌కు టీఆర్ఎస్ అదే స్థాయిలో రిప్లై ఇస్తుందా..!?

అసలు ముఖ్యమంత్రి ఎవరైనా సరే పాతబస్తీలో మాత్రం అసదుద్దీనే సీఎం అంటాడు ఓ నేత. తాము చెప్పినట్లు రాజకీయం చేస్తాడు .. మా ఇంటి గుమస్తాతో సమానం అని కేటీఆర్‌ను విమర్శిస్తాడు మరో నేత. పాతబస్తీలో అడుగు పెట్టాలంటే… అసద్ పర్మిషన్ తీసుకోవాలని కేటీఆర్‌ను హెచ్చరిస్తాడు మరో చోటా నేత. నిన్నంతా మజ్లిస్ నేతలు… టీఆర్ఎస్‌పైనా.. కేటీఆర్‌పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు..? హఠాత్తుగా మిత్రోం పార్టీపై ఎందుకు కోపం వచ్చిందన్నది తర్వాతి విషయం. అసలు మజ్లిస్ అన్నన్ని మాటలు అంటూంటే.. టీఆర్ఎస్ స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాసశం.

మజ్లిస్ నేతలు నేరుగా కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఆ స్థాయిలోనే వారికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. చోటా నేతలు వారిపై విమర్శలు చేస్తే.. అది భయపడినట్లుగా అవుతుందన్న అభిప్రాయం ఉంది. మజ్లిస్ నేతలు చిన్న చిన్న మాటలు మాట్లాడలేదు. ఓ ప్రణాళిక ప్రకారమే.. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఓట్లు గుంపగుత్తగా బీజేపీకి మాత్రమే పోకుండా.. తమకు బీజేపీ మాత్రమే… ప్రత్యర్థి కాదని.. టీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి అని చెప్పడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే నిజం అయితే టీఆర్ఎస్ కూడా… ఈ కొద్ది రోజులు తమకు మజ్లిస్ ప్రత్యర్థి అని నిరూపించడానికైనా అదే స్థాయిలో పొలిటికల్ ఎటాక్ చేయాల్సి ఉంది.

అయితే టీఆర్ఎస్, మజ్లిస్ రహస్య స్నేహితులేం కాదు.. డైరక్ట్ ఫ్రెండ్సే. ఆ విషయాన్ని కేసీఆర్ ఎప్పుడో తేల్చేశారు. ఇప్పుడు పొత్తుల్లేవని చెప్పుకోవచ్చు కానీ మిత్రులు కాకుండా ఉండలేరు. అలా అని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా పడి ఉంటే.. టీఆర్ఎస్ ఇజ్జత్ తీసేసినట్లవుతుంది. వాస్తవానికి మజ్లిస్ నేతల తీరే అంత. గతంలో చంద్రబాబు టైంలో ఓ సారి అసదుద్దీన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు… పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అరెస్టయ్యారు. ఆ రెండు సందర్భాలను గుర్తు పెట్టుకుని ఇప్పటికీ వారిపై ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మిగతా అందరూ నేతలు వారితో సన్నిహితంగానే ఉన్నారు. తమకు పాతబస్తీలో ఉన్న బలం వల్ల ఎవర్నీ వారు లెక్క చేయరు. తమతో స్నేహం చేయడాన్ని వారు అలుసుగా చూస్తున్నారు. టీఆర్ఎస్ కౌంటర్ గట్టిగా ఇవ్వకపోతే.. హిందూ ఓటర్లలో తేడాగా సందేశం వెళ్లే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close