టీఆర్ఎస్‌కు టెన్షన్‌కు పుట్టిస్తున్న బీజేపీ..!

తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని..టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంతర్గత సమావేశాల్లో చెబుతూంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం.. నేరుగానే ఆ వ్యాఖ్యలు చేస్తూంటారు. కానీ.. టీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయం మాత్రం వేరుగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా బీజేపీపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. బయటకు.. మాత్రం.. బీజేపీ ఉనికి లేదంటున్నారు . బీజేపీ ఎలా బలపడుతుందో.. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే చూశారు. తెలంగాణలోనూ అదే కోణంలో.. ఇప్పుడు బీజేపీ ముందడుగు వేస్తోంది. ఈ విషయం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు తెలియనిది కాదు. కానీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తే… ప్రత్యర్థి బలం పుంజుకుంటారన్న కారణంగానే.. గుర్తింపు ఇవ్వడానికి కేసీఆర్, కేటీఆర్ నిరాకరిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

రెండేళ్లలో బీజేపీ సర్కారొస్తుందంటున్న కమలం నేతలు.. !

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. అంశం ఏదైనా ఇరు పార్టీల నేత‌లు క‌స్సుమ‌ని లేస్తున్నారు. రాష్టానికి వ‌స్తున్న బీజేపీ అగ్రనేత‌లు సైతం టీఆర్ఎస్ కు నేరుగా వార్నింగ్ లు ఇస్తున్నారు. పార్టీ చీఫ్ అమిత్ షా కూడా టీఆర్‌ఎస్ విషయంలో దూకుడుగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాంతో కొంత మంది నేతలు.. రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతుందని ప్రకటనలు చేసేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయం చూస్తూనే ఉన్నారు కాబట్టి… తెలంగాణలో ఏం చేస్తారోనన్న భయం..టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.

బీజేపీ ఏం చేస్తుందోనని ఆరా తీస్తున్న టీఆర్ఎస్..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీన పడుతూ వస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది గులాబీ గూటికి చేరటం ఆ పార్టీ బలహీన పడటానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ అంశమే బీజేపీకి అస్త్రంగా మారింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బిజెపి గెలవడం ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వంలోను జోష్ నింపింది. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసి…అధికారంలోకి రావటమే లక్ష్యంగా బిజెపి అధిష్టానం పావులు కదుపుతోంది. తెలంగాణ లో టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలను ఇప్పటినుంచే ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ బలహీనపడటంతో బీజేపీకి చాన్స్..!

బిజెపి అంటే…పెద్దగా స్పందించని టిఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. గతంలో అంశాల వారిగా బిజెపి అండగా నిలిచిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేంద్రం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదంతా రాష్ట్రంలో బిజెపి ఏదో చేస్తోందనే భయం టిఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఎప్పుడు బిజెపి గురించి ఆరా తీయని నేతలు…ఇప్పుడు కమలం పార్టీ కదలికపై ఫోకస్ పెట్టారు. ఎవరన్న బీజేపీతో టచ్ లో ఉన్నారా అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. బిజెపిని తక్కువ అంచనా వేస్తే అసలుకే మోసం వస్తుందనే చర్చ టిఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది. అందుకే బిజెపికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచే నేతలకు సూచనలు చేస్తోంది. పైకి మాత్రం.., బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close