టీఆర్ఎస్‌ను తప్పుబట్టిన కోదండరామ్

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అధికార టీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించినా అది తప్పేనంటూ పరోక్షంగా టీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలు కోరుకుంటున్నామని అన్నారు. పార్టీల మధ్య జరిగే రాజకీయ వివాదాల జోలికి తాము పోదలుచుకోలేదని చెప్పారు. ఒక పార్టీని వదిలివెళ్ళటం లాంటి పరిణామాలు రాజకీయ అస్థిరతకు దారితీస్తాయని అన్నారు. ఇటీవల టీఆర్ఎస్‌లోకి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి పెద్దఎత్తున నాయకులు చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ చేపట్టిన ఆ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ఆ పార్టీ కీలకనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ సమర్థించుకోవటమేకాక, ఇది తామొక్కరమే చేస్తున్నామా అని ఇటీవల ఎదురు ప్రశ్నించిన విషయం కూడా అందరికీ విదితమే.

రైతుల ఆత్మహత్యల నివారణకు కళాకారులు పాటలు తయారుచేయాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. గ్రూప్ డి, బ్యాంక్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో మెలగాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. త్వరలో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని...

నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు....

లాక్‌డౌన్ 5.0 ఖాయమే..! కాకపోతే పేరుకే..!?

నాలుగో లాక్ డౌన్ గడువు కూడా ముంచుకొస్తోంది. మరో మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి..? తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలనే ఆలోచనలనే కేంద్రం ఉంది....

సూర్య బ్ర‌ద‌ర్స్‌ని క‌లిపిన రీమేక్‌

సూర్య హీరోగా నిల‌దొక్కుని, ఓ ఇమేజ్ సాధించిన త‌ర‌వాతే... కార్తి రంగ ప్ర‌వేశం చేశాడు. తాను కూడా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక్క సినిమాలోనూ న‌టించ‌లేదు....

HOT NEWS

[X] Close
[X] Close