అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ గ్రూప్ హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలో వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలన్నప్రణాళికను ప్రకటించింది. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఈ పెట్టుబడిని ప్రకటించారు. 2021లో ఈ కంపెనీని ఫ్లోరిడాలో ప్రారంభించారు. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, ఫిన్టెక్ సేవలపై ఫోకస్ చేస్తుంది.
ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ ను ఈ కంపెనీ నుంచే రూపొందించారు. ఈ ఫ్లాట్ ఫాంకు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అలాగే ట్రూత్ పేరుతో స్ట్రీమింగ్ సర్వీస్ కూడా ఉంది. న్యూస్, క్రిస్టియన్ కంటెంట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అలాగే ఫినాన్షియల్ & ఫిన్టెక్ బ్రాండ్ కూడా ఉంది. ఈ సంస్థకు చైర్మన్ గా ట్రంప్ ఉన్నారు. సుమారు $3.23 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. గ్లోబల్ గా విస్తరించాలన్న లక్ష్యంతో మొదటి సారి.. హైదరాబాద్లోనే భారీ పెట్టుబడులు ప్రకటించారు.
హైదరాబాద్లో అమెరికా ఎంబసీ ఉన్న రోడ్ కు ట్రంప్ పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం అనుమతి రావాల్సి ఉంది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా నాలుగేళ్లే ఉంటారు. తరవాత మరో కొత్త అధ్యక్షుడు వస్తారు. ట్రంప్ ను మర్చిపోతారు. కానీ.. ట్రంప్ గ్రూప్ ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించడంతో.. రేవంత్ ఆయన పేరుతో ఓ రోడ్డును పెట్టేందుకు ప్రతిపాదించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే కేంద్రం అనుమతి ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు.
