శ్రీవారి సొమ్ము ఫలహారం..! జంబో కేబినెట్‌లా టీటీడీ బోర్డు..!

ఒక చైర్మన్..!
24 మంది పాలకమండలి సభ్యులు..!
నలుగురు ఎక్స్ అఫీషియే సభ్యులు..!
ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు…!

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని … భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి ఏర్పాటైన పాలక మండలి ఇది. మొత్తంగా 36 మంది. గతంలో ఎప్పుడూ.. ఇంత మంది పాలక మండలిలో లేరు. ఇప్పుడు మాత్రం… ఇంకా ఒత్తిడి వస్తే.. మరో పదిమందిని నియమించేలా… ప్రభుత్వం ఉంది. ఇంత మందితో… టీటీడీ బోర్డు పాలన సాగుతుందా..? పడకేస్తుందా..?

కేబినెట్‌కైనా పరిమితి.. టీటీడీ బోర్డుకు లేదా..?

రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేను మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవాలనే నిబంధన ఉంది. అందుకే ఇరవై ఐదు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను పరిపాలించడానికి ఇరవై ఐదు మంది మంత్రులు. కానీ.. రోజులకు లక్ష మంది అటూ ఇటుగా వచ్చే భక్తుల సౌకర్యాలు చూసుకోవడానికి ఏకంగా… చైర్మన్ తో కలిపి 36 మందితో పాలక మండలి. పాలక మండలికి చాలా పరిమితంగా సభ్యులు ఉండాలి. కానీ ప్రభుత్వాలు .. రాజకీయఅవసరాల కోసం.. టీటీడీని రాజకీయ పునరావాస శిబిరంగా మార్చేశాయి. కొత్త ప్రభుత్వం అయితే.. ప్రభుత్వ పెద్ద కేసుల్లోని సహచరులను… ఇతర రాజకీయ సంబంధాలతో వచ్చిన సిఫార్సులను.. అంగీకరించి.. ఎవర్నీ నొప్పించలేక.. అందరికీ.. టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. దానికి రకరకాల పేర్లు పెట్టారు. చివరికి అది 36 మందికి చేరింది.

శ్రీవారి సొమ్ము బోర్డుకు ఫలహారం..!?

టీటీడీ బోర్డు సభ్యుడంటే… కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కొండ పైన పర్మినెంట్ గా కాటేజీ, ఎప్పుడు వెళ్లినా అవసరాలు చూసుకోవడం, వాహనం, రోజుకు రెండు వందల బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇలా… చాలా సౌకర్యాలు ఉంటాయి. ఇవి కాకుండా.. తిరుమల కేంద్రం… వారి వారి సిఫార్సు లేఖలతో జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు. కొంత మంది పారిశ్రామిక వేత్తలు కూడా.. దర్శనం టిక్కెట్ల కోసం… టీటీడీ బోర్డు సభ్యత్వం తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీటీడీ ఈవోగా చేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్ లో అదే చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యులు.. టిక్కెట్ల కోసం తప్ప ఇంక దేనికీ ఉపయోగపడరని తేల్చి చెప్పారు. కానీ వారి వల్ల .. శ్రీవారికి ఏటా కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో అవినీతిపరులు ఉంటే.. జరిగే నష్టాన్ని అంచనా వేయలేం.

టీటీడీ బోర్డు వల్ల భక్తులకు ఏమైనా ఉపయోగం ఉందా..?

పాలమండలి అనేది.. శ్రీవారి సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కీలక నిర్ణయాలు ఆ కోణంలోనే తీసుకోవాలి. కానీ.. రాను రాను … రాజకీయ పునరావస కేంద్రంగా మారిపోయిన… టీటీడీ బోర్డు… భక్తుల సౌకర్యాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. నిజానికి పలువురు సభ్యులు… పాలక మండలి సమావేశాలకు కూడా.. పెద్దగా రారు. వారికి కావాల్సింది.. పాలక మండలి సభ్యుల హోదాలో.. వచ్చే ప్రయోజనాలు మాత్రమే. పరిమితంగా ఉంచాల్సిన బోర్డును… పంపకం చేసి… ఏపీ సర్కార్.. కొత్త ట్రెండ్ సృష్టించింది. స్వామి వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close