ప్రభుత్వంపై కోర్టుకెళ్లిన శ్రీవారి ప్రధాన అర్చకుడు..!

శ్రీవారి నామస్మరణతో నిత్యం ఆయన కంకైర్యాలను నిష్టతో చేయాల్సిన అర్చకులు అన్యాయం జరిగిందంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం.. అస్మదీయులకు పెద్ద పీట వేసేందుకు ఇతరులకు అన్యాయం చేయడం లాంటివి చేస్తూండటంతో.. ప్రధాన అర్చకులు కూడా.. న్యాయస్థానాల వెంట పరుగులు తీయాల్సి వస్తోంది. గతంలో తనను పదవి నుంచి తొలగించారంటూ రమణదీక్షితులు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. తాజాగా వేణుగోపాల దీక్షితులు అనే ప్రధాన అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. రమణదీక్షితులు రిటైర్మెంట్ తర్వాత వేణుగోపాల దీక్షితులనే ప్రధాన అర్చకునిగా ఉన్నారు.

అయితే ప్రభుత్వం తిరుపతి ఎన్నికలకు ముందుకు… రమణదీక్షితులకు మళ్లీ ప్రధాన అర్చకునిగా పదవి ఇచ్చింది. దీంతో వేముగోపాల దీక్షితులకు అన్యాయం జరిగినట్లయింది. దీంతో ఆయన తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా.. తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని ప్రధానంగా సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను వేణుగోపాలదీక్షితులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ.. ప్రభుత్వం, టీటీడీపై కోర్టును వేణుగోపాల దీక్షితులు ఆశ్రయించడంతో సంచలనంగా మారింది.

గతంలో రమణదీక్షితులు.. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాతనే కోర్టులో పిటిషన్ వేశారు. వేణుగోపాల దీక్షితులను తప్పించడానికి కూడా అవకాశం లేదు. ఆయన వంశపారంపర్య అర్చకుడు. అర్చకులు ఇలా న్యాయం కోసం.. అసలు పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం… శ్రీవారి భక్తుల్ని విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ పార్టీలు … దేవుడితో రాజకీయాలు చేయడం మానుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామ కేసు రాజకీయాల్ని మలుపు తిప్పబోతోందా..!?

రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారుతోంది. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారన్నది పెద్ద విషయం అయ్యేఅవకాశం లేదు. ప్రభుత్వ పెద్దల ఇష్టం ప్రకారం.. మూడు...

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

HOT NEWS

[X] Close
[X] Close