ట్విట్టర్ దృష్టిలో ట్రంప్, కంగన సేమ్ టు సేమ్..!

ట్విట్టర్ ఖాతా ఉంది.. భావప్రకటనా స్వేచ్చ ఉంది.. అంతకు మించి ఏం మాట్లాడినా చెల్లుబాటయ్యేలా బీజేపీ భక్తుల మద్దతు ఉందని.. చెలరేగిపోయిన కంగనా రనౌత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను ట్విట్టర్ సంస్థ శాశ్వతంగా తొలగించింది. కంగనా రనౌత్ చాలా రోజులుగా.. బీజేపీకి మద్దతుగా ట్వీట్లు చేస్తున్ారు. అయితే బీజేపీకి మద్దతు ఇవ్వడం అంటే.. ఇతర వర్గాల్ని కించ పర్చడం… తిట్టడం.. విద్వేషాన్ని పెంచడం అనుకోవడంతోనే సమస్య వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారని దేశద్రోహులనడం దగ్గర్నుంచి ఆమె ట్వీట్లు.. వర్గాల మద్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి.

ఆమెపై మహారాష్ట్రలో ఈ అంశంపై కేసులు కూడా నమోదయ్యాయి. మూడు రోజులుగా ఆమె మరీ విద్వేష ట్వీట్లు చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికలపైనా .. ఫలితాలపైనా కామెంట్లు చేసింది. చివరికి ఆక్సిజన్ సిలిండర్ల కొరతను ప్రశ్నిస్తున్న వారినీ తిట్టింది. విపరీతంగా ఆక్సిజన్ వాడేస్తున్నారని.. ఆరోపించింది. అందరికీ సాయం చేస్తూ పేరు తెచ్చుకున్న సోనూ సూద్‌ పెద్ద ఫ్రాడ్ అంటూ పెట్టిన ఓ పోస్టుకు సైతం కంగనా లైక్ కొట్టింది. ఆమె ట్వీట్లపై రాను రాను ఫిర్యాదులు పెరిగిపోవడంతో.. చివరికి ట్విట్టర్ కూడా.. పరిిశఈలించక తప్పలేదు. సహించలేక… ట్విట్టర్ సంస్థనే అధికారికంగా నిర్ణయం తీసుకుంది.

తనకు పెద్ద సపోర్ట్ ఉందని.. రెచ్చిపోయిన కంగన ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సపోర్ట్ కాపాడలేకపోయింది. తమకు వ్యతిరేకంగా వచ్చే ట్వీట్లను తీసేయించడంలో చురుకుగా ఉండే బీజేపీ.. తమకు మద్దతిస్తున్న కంగనా ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close