ఐపీఎల్ క‌థ ఐపాయె!

అనుకున్న‌దే అయ్యింది. ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. కొల‌కొత్తాకు చెందిన ఇద్ద‌రు ఆట‌గాళ్లు క‌రోనా బారీన ప‌డ‌డంతో… సోమ‌వారం జ‌ర‌గాల్సిన మ్యాచ్ వాయిదా వేశారు. ఈరోజు మ‌రికొంత‌మంది ఆట‌గాళ్ల‌కు వైర‌స్ సోకింద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో… టోర్నీని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ధ్రువీకరించారు. ఈ రోజు హైద‌రాబాద్, ముంబై జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సివుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాకి క‌రోనా పాజిటీవ్ అని తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. మిగిలిన ఆట‌గాళ్ల‌కూ క్వారెంటైన్ కి పంపాల్సిరావ‌డం, ఆట‌గాళ్ల‌లో క‌రోనా భ‌యాలు ఎక్కువ అవ్వ‌డంతో, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. అయితే.. ఈ టోర్నీ వేదిక‌ను దుబాయ్ కి మ‌ర‌ల్చే అవ‌కాశం ఉంది. జూన్ – .జులైల‌లో.. ఐపీఎల్ ని దుబాయ్ లో కొన‌సాగించేందుకు బీసీసీఐ క‌స‌రత్తు చేస్తోందిని తెలుస్తోంది. దుబాయ్‌కి మ‌ర‌ల్చాల‌న్న ప్ర‌తిపాద‌న ఓకే చేశాకే… ఐపీఎల్ ని నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్టు నిర్ణ‌యించుకున్నార‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close