వెంకీ చేతికి ‘డ్రైవింగ్ లైసెన్స్‌?’

వెంక‌టేష్ కి రీమేక్ సినిమాలంటే ఎంత మ‌క్కువో..? ఆయ‌న హిట్ సినిమాల్లో స‌గం రీమేక్‌లే. ఇప్పుడు మూడు సినిమాలు సెట్స్ లో ఉంటే.. (దృశ్య‌మ్ 2, నార‌ప్ప‌, ఎఫ్ 3) అందులో రెండు రీమేక్‌లు. ఇప్పుడు మ‌రో రీమేక్ పై వెంకీ దృష్టి ప‌డింది. అదే.. డ్రైవింగ్ లైసెన్స్‌. రెండేళ్ల క్రితం మ‌ల‌యాళంలో విడుద‌లైన సినిమా ఇది. పెద్ద హిట్. 5 కోట్ల‌తో సినిమా తీస్తే ఏకంగా 40 కోట్లు రాబ‌ట్టింది. డ్రైవింగ్ లైసెన్స్‌ని తెలుగులో తీస్తే బాగుంటుంద‌ని చాలా రోజుల నుంచీ.. భావిస్తున్నారు. ఆ సినిమా వెంక‌టేష్ చేస్తే ఇంకా బాగుంటుంద‌న్న‌ది సినీ వ‌ర్గాల ఉవాచ‌. అదే జ‌రుగుతోంది. ఈసినిమా రైట్స్ ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. వెంక‌టేష్ న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్‌. వెంకీతో పాటుగా మ‌రో హీరో కావాలి. ఆ హీరో ఎవ‌ర్న‌ది తేలాల్సివుంది. ప్ర‌స్తుతానికైతే డ్రైవింగ్ లైసెన్స్ ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు, ముఖ్యంగా వెంకీ శైలికి న‌చ్చేలా మార్పులు చేర్పులూ చేస్తున్నారు. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చాకే.. రెండో హీరో ఎవ‌ర‌న్న‌ది తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close