అవును నిజమే..! టీటీడీలో మరో వీఐపీ దర్శన వ్యవస్థ..!

తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారిని దగ్గర చేస్తున్నామని.. గొప్పగా.. బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లుగా ప్రకటించుకున్న టీటీడీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అందులో ఉన్న అసలు గుట్టును మాత్రం… సీక్రెట్‌గా ఉంచారు. ఎల్ 1, ఎల్ 2 దర్శనాల స్థానంలో కొత్త వీఐపీ దర్శనాలను తీసుకొచ్చేందుకే.. ఈ వ్యవస్థను.. మూసేశారన్న ప్రచారం టీటీడీలో జరిగింది. దీనికి తగ్గట్లుగానే.. త్వరలో కొత్త వీఐపీ దర్శన వ్యవస్థ తీసుకొస్తామని.. టీటీడీ హైకోర్టుకు తెలిపింది. వీఐపీ దర్శన వ్యవస్థ రద్దుపై.. హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు.. టీటీడీ కోర్టుకు తెలిపింది.

టీటీడీకి పూర్తి స్థాయి పాలక మండలి ఇంకా ఏర్పాటు కాలేదు. కేవలం టీటీడీ చైర్మన్ ను మాత్రమే నియమించారు. నిబంధనల ప్రకారం.. ఏ నిర్ణయం అయినా పాలకమండలి ద్వారానే జరగాలి. చైర్మన్ ఒక్కరే ఉన్నందున.. పాలక మండలి నిర్ణయాలుగా పరిగణించలేరు. అందుకే.. పాలకమండలి ఏర్పడిన తర్వాత బ్రేక్ దర్శనాలకు కొత్త వ్యవస్థ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇది కొత్త వ్యవస్థ అని చెబుతున్నప్పటికీ.. అసలు ఇది వైఎస్ హయాంలో ఉన్న వ్యవస్థనే తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ హయాంలో ప్రస్తుతం టీటీడీ జేఈవోగా ఉన్న ధర్మారెడ్డినే.. అప్పుడు కూడా జేఈవోగా ఉన్నారు. ఆయనే వీఐపీల కోసం ప్రత్యేకంగా దర్శన వ్యవస్థ ఏర్పాటు చేశారు.

టీటీడీ జేఈవో ధర్మారెడ్డి ఉన్నప్పుడు.. అర్చనానంతరం దర్శనం పేరుతో ఇవే దర్శనాలుండేవి. అలాగే సెల్లార్ దర్శనాలుండేవి. వీటీ ద్వారా వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు చేయించేవారు. అంతే కాదు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా.. ఈ దర్శనాలు లభించేవి. త్వరలో.. ఇలాంటి వ్యవస్థ తీసుకు రాబోతున్నారని తెలుగు 360 ఈ నెల పద్దెనిమిదో తేదీనే తెలిపింది.

https://www.telugu360.com/te/new-vip-darshan-system-in-ttd/

ఎలా చూసినా సిఫార్సు లేఖలను.. వేల రూపాయలకు అమ్ముకుంటారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎల్ వన్ దర్శనాల విషయంలోనూ.. ఇవే ఆరోపణలు ఉన్నాయి. పేరు ఏదైనా.. సిఫార్సు లేఖల ద్వారా… వీఐపీ దర్శనం ఖరీదుగా మారింది. దాన్ని ఇప్పుడు కొనసాగించబోతున్నారు . పేరు మారుస్తున్నారు తప్ప.. ఎలాంటి సంస్కరణలూ అమలు చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close