టీటీడీలో ధర్మారెడ్డి మార్క్ వీఐపీ దర్శన వ్యవస్థ ..!?

తిరుమలలో ఎల్-1, ఎల్ -2, ఎల్ – 3 పేరుతో పిలిచే బ్రేక్ దర్శనాలను.. రద్దు చేశారు. సిఫార్సులతో వచ్చే ఎల్ కేటగిరి దర్శనాలకు.. వీఐపీ ట్రీట్‌మెంట్ ుంటుంది. అయితే.. ఎల్ -1 దర్శనాలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. పూర్తిగా సిఫార్సు లేఖల మీదే ఉంటాయి. తెలిసిన ఎమ్మెల్యేనో.. లేక ఇతర ప్రజాప్రతినిధినో… ఇంకా.. టీటీడీ బోర్డు సభ్యుడో… మరో అధికారం ఉన్న వ్యక్తో.. సిఫార్సు చేస్తే.. ఈ ఎల్ -1 దర్శనాలకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు వీటిని రద్దు చేశారు.

వీఐపీ దర్శనాల కోసం కొత్త వ్యవస్థ..!

ఈ బ్రేక్ దర్శనాలకు టీటీడీ నిర్ణయించిన టిక్కెట్ ధర రూ. 5వందలు. భక్తులు మాత్రం… ఒక్కొక్కరికి రూ. 10 నుంచి 15 వేల వరకు చెల్లిస్తూంటారు. మిగతా అంతా.. దళారుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. తిరుమలలో అనేక మంది ప్రజాప్రతినిధులకు పీఆర్వోలు ఉంటారు. ప్రజాప్రతినిధులకు తిరుమలలో పీఆర్వోలు ఎందుకో.. చాలా మందికి అర్థం కాదు. కానీ వారు చేసే పని ఈ దర్శన టిక్కెట్ల దళారీ పనులు. ప్రజాప్రతినిధుల లక్షలు ముట్టచెప్పి.. పి.ఆర్.ఓ పోస్టు కొనుగోలు చేసుకుని, ఆయన లేఖల ద్వారా వి.ఐ.పి దర్శనాలను అమ్ముకుని నెలకు లక్షలు సంపాదించుకుంటారు. ఇలా ఒక్కరు కాదు.. చాలా మంది ఉన్నారు. ఈ దళారీ వ్యవస్థ పేరుకుపోయిందని… కొత్త చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. అందుకే రద్దు చేశామన్నారు. బాగానే ఉంది కానీ.. ఆయన ప్రత్యామ్నాయ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పడంతోనే అనుమానాలు ప్రారంభమయ్యాయి.

గతంలో జేఈవో ధర్మారెడ్డి తెచ్చిన వ్యవస్థ మళ్లీ తెస్తున్నారా..?

వీఐపీ దర్శనాల వ్యవస్థ.. బ్రేక్ దర్శనాల రద్దుతో అంతమయ్యే పరిస్థితి లేదు. వివాదాస్పదమైనప్పుడల్లా.. వీటి పేర్లు మారుస్తున్నారు అంతే. ఏదో ఒకరూపంలో ఇది కొనసాగుతోంది. గతంలో అర్చనానంతరం దర్శనం పేరుతో ఇవే దర్శనాలుండేవి. అలాగే సెల్లార్ దర్శనాలుండేవి. ఇప్పుడు తిరుమల జెఈవోగా నియమితులైన ధర్మారెడ్డి వీటిని ప్రవేశపెట్టారు. ధర్మారెడ్డి జెఈవోగా వెళ్లిపోయిన తరువాత వచ్చిన శ్రీనివాసరాజు జెఈవోగా ఇప్పుడున్న ఎల్ -1, ఎల్ -2 దర్శనాలను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మళ్లీ ధర్మారెడ్డి ప్రత్యేకాధికారిగా వచ్చారు. మళ్లీ ధర్మారెడ్డి అర్చనానంతర దర్శన, సెల్లార్ దర్శనాల్లాంటివేవో ప్రవేశ పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదైనా సిఫార్సు లేఖల పేరుతో భక్తుల్ని దోపిడీ చేయడానికేనన్న చర్చ జోరుగా సాగుతోంది.

సామాన్య భక్తులను వీఐపీలుగా ఎప్పుడు పరిగణిస్తారు..?

ఎల్ వన్ దర్శనాల రద్దుతో ఇప్పుడంతా వి.ఐ.పి. దర్శనాలపై చర్చ జరుగుతోంది. మరో వైపు కోర్టు లో కేసు నడుస్తోంది. కోర్టుకు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది. బహుశా కోర్టు తీర్పు తర్వాత కొత్త దర్శన విధానాన్ని ప్రవేశపెడతారనే చర్చ జరుగుతోంది. వి.ఐ.పిలు స్వయంగా వస్తే ప్రోటకాల్ పాటించాలి కానీ.. సిఫార్సు లేఖలకు వీఐపీ దర్శనాలు కల్పించే పరిస్థితి పోతేనే.. సామాన్య భక్తుడికి అండగా ఉన్నట్లవుతుందని అంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదని..వీఐపీ లేఖల డిమాండ్‌కు తగ్గట్లుగా.. అదొక వ్యవస్థ ఉంటుందని కొత్త చైర్మన్ చెప్పకనే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.. డీజీపీ పర్మిషన్ ఇచ్చారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో... చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే...

జగ్గారెడ్డి, టీవీ9 మీద ఈగ వాలనీయడం లేదుగా..

జగ్గారెడ్డి అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేత. అధికారంలో ఉన్న కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యుల మీద పదునైన విమర్శలు చేయడానికి విపక్ష నేతలు భయపడుతూ ఉన్న సమయంలో కూడా జగ్గారెడ్డి...

ఎల్జీ పాలిమర్స్‌ కేసులో ఆ వివరాలన్నీ చెప్పాలన్న హైకోర్టు..!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై... హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేయడంతో పాటు.. హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై .. విచారణ జరిపి... అనేక...

బాపట్ల ఎంపీ..మందడంలో భూమాయ..!?

కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close