మీడియా వాచ్ : ఈ టీవీ9 పరిశోధన ఆ “ఐటీ దాడుల”ప్పుడు లేదేమి..?

ఐటీ దాడులు జరిగిన సంస్థల పేర్లు ఏమిటో సీబీడీటీ శాఖ తన ప్రెస్‌నోట్‌లో వెల్లడించలేదు. ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ సోదాలు చేశామని చెప్పింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో చెప్పలేదు. ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరో కూడా.. సీబీడీటీ నోట్‌లో లేదు. కానీ.. టీవీ9 పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో… ఆ సెక్రటరీ ఎవరో కనిపెట్టింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టింది. కానీ ఆ మూడు కంపెనీలు ఏవో కనిపెట్టలేకపోయింది. ఒక వేళ కనిపెట్టినా అదేమంత గొప్ప విషయం.. ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం లేదనుకుందేమో కానీ… ప్రచారం ప్రారంభించారు. బోర్డు మీద.. కంపెనీలకు డబ్బులు ఎలా వస్తాయి.. ఎలా తరలిస్తారు.. షెల్ కంపెనీలు ఎలా సృష్టిస్తారు… అనేది స్పష్టంగా వివరిస్తూ కథనాలు ప్రసారం చేసింది. నిజంగా.. అసలు ఈ డొల్ల కంపెనీలు అంటే తెలియని వారికి..గొప్ప సమాచారం ఇచ్చాయి.

అయితే.. ఇక్కడ ఆ మూడు ఇన్ఫ్రా కంపెనీల గురించి చెప్పకుండా.. కేవలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొరికాయంటూ… షెల్ కంపెనీల గురించి రాసుకొచ్చారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పేరుపై ఒక్క కంపెనీ కూడా ఉండే అవకాశం లేదు. ఆయన ఇంట్లో దొరికింది రెండు లక్షలు, పన్నెండు తులాల బంగారం అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సరే.. సోర్స్ ద్వారా.. గొప్ప సమాచారం దొరికింది కాబట్టి చెబుతున్నారు అనుకున్నా… ఆ మూడు కంపెనీల గురించి మాత్రం.. చెప్పడం లేదు. అందులో ఒక కంపెనీ గురించి మాత్రం.. అసలు నోరెత్తడం లేదు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలి పెట్టకుండా రచ్చ చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి దాడులు కొన్నాళ్ల కిందట.. ఓ బడా పారిశ్రామికవేత్తపై జరిగాయి. పది రోజుల పాటు జరిగాయి.ఇప్పుడు విడుదల చేసినట్లే అప్పట్లోనూ.. సీబీడీటీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొన్ని వేల కోట్లు అక్రమంగా తరలించారని స్పష్టం చేసింది. దాని గురించి కనీసం ఒక్క వార్త ప్రసారం చేయలేదు. దానికి కారణం… ఆ ఐటీ దాడులు జరిగింది.. తన యజమానిపైనే. కానీ ఇప్పుడు.. మూడు కంపెనీలను పక్కన పెట్టి.. ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసింది పేరుగొప్ప టీవీ చానల్. రాజకీయాల కోసం మీడియాను అమ్ముకుంటున్న వైనం మరోసారి స్పష్టమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close