టీఆర్పీల్లో తిరుగులేని టీవీ9..!

యాజమాన్యం మార్పుతో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నుంచి టీవీ9 వేగంగా బయట పడుతోంది. టీఆర్పీల్లో మళ్లీ తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకుంది. గతంలో తన మొదటి స్థానాన్ని కోల్పోకపోయినప్పటికీ.. ఇతర చానళ్లు… అందుకునేలా … టీవీ9 తగ్గిన సూచనలు కనిపించాయి. కానీ చాలా వేగంగానే.. టీవీ9 పుంజుకుంది. ఈ ఏడాదిలో నలభై ఐదో వారం టీఆర్పీల్లో..ఎవరికీ అందనంత ఎత్తులో టీవీ9 నిలిచింది. వారం మొత్తం మీద 76.26 శాతం రేటింగ్ సాధించింది. రెండో స్థానంలో ఉన్న వీ6 చానల్ కు వచ్చిన రేటింగ్ 44.23 మాత్రమే. అంటే… మొదటి స్థానంలో ఉన్న టీవీ9కు.. రెండో స్థానంలో ఉన్న వీ6కు మధ్య 32 పాయింట్లకుపైగా తేడా ఉంది. ఇది .. గతంలో.. అగ్రస్థానానికి పోటీ పడిన టీవీ5 చానల్‌కు వచ్చినంత రేటింగ్. అంటే టీవీ9ను అందుకోవడం.. ఇతర చానళ్లకు అంత తేలికైన విషయం కాదు.

రెండో స్థానంలో ఉన్న వీ6 న్యూస్… ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితమైన చానల్. అచ్చ తెలంగాణ వార్తలని.. ఆ చానల్ నిర్మొహమాటంగా ప్రకటించుకుంటుంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో… టీవీ9 తర్వాత వీ6కే అత్యధిక ఆదరణ ఉంది. దీంతో.. రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఎన్టీవీ 39 రేటింగ్ సాధించి.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాత స్థానాల్లో టీ న్యూస్, టీవీఫైవ్, సాక్షి ఏబీఎన్, హెచ్‌ఎంటీవీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వంటి చానళ్లు నిలిచాయి. టీవీ9 సాధించిన రేటింగ్స్… మొత్తం పదిహేను చానళ్లలో.. టాప్ పైవ్ మినహా… మిగిలిన పది చానళ్లు తెచ్చుకుంటున్న రేటింగ్స్ తో సమానం. అర్బన్, రూరల్ ఏరియాలతో పాటు.. వయసుల వారీగా ప్రేక్షకుల్లోనూ.. టీవీ9 ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

న్యూస్ సెన్సేషనలిజానికి పెట్టింది పేరైనా… టీవీ9 .. యాజమాన్య మార్పుతో.. కొన్ని పరిమితులకు లోబడాల్సి వచ్చింది. ఆ కారణంగా.. కొన్నాళ్ల క్రితం.. వరకూ.. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. అయితే.. ఇటివలి కాలంలో.. మళ్లీ సెన్సెషలిజం దారికి మళ్లీ మళ్లిన సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. కొన్ని కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ కారణంగా.. రేటింగ్‌లలో మళ్లీ తిరుగులేని స్థానానికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేషన్ వాంట్స్ టు నో ఓన్లీ ” సుశాంత్ కేస్ “

దేశ ప్రజలకు ఇప్పుడు ఏది ముఖ్యమైనది...? ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు..? ఆ సమాచారం కోసం ఏ టీవీల్ని చూస్తున్నారు..? లాంటివన్నీ పరిశీలిస్తే.. ప్రస్తుతం న్యూస్ ట్రెండ్ తెలిసిపోతుంది. రిపబ్లిక్ టీవీ సుశాంత్ సింగ్...

వావ్.. రాయల్స్ దంచేశారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ ఆదివారం ఓ స్పెషల్‌గా మారుతోంది. గత వారం సూపర్ ఓవర్‌దాకా సాగిన మ్యాచ్ ఊపిరిబిగపట్టి చూసేలా చేయగా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ అసలు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని...

రెండో స్థానానికి పడిపోయిన టీవీ9, అంతర్మధనం

పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో టిఆర్పి రేటింగులో తాము మొదటి స్థానంలో ఉన్నామని, రెండవ స్థానంలో ఉన్న ఛానల్...

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close