మీడియావాచ్ : జగన్ భజనలో టీవీ9 కొత్త పుంతలు..!

టీవీ 9 .. ఏపీ సర్కార్‌ను… ఆహో.. ఓహో అని పొగడటంలో.. ఏ మాత్రం మొహమాటాలు పెట్టుకోవడం లేదు. మీడియాగా ప్రజల వాయిస్‌ను వినిపించాల్సిన టీవీ9 కేవలం.. జగన్ వాయిస్‌ను..వినిపిస్తూ.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ..సోషల్ మీడియాలో.. వైసీపీ కార్యకర్తలు .. తన నేతను కీర్తించుకుంటూ చేసే పొగడ్తల తహా హెడ్‌లైన్స్… క్యాప్షన్స్ పెట్టుకుంటూ.. స్వామి భక్తిని విపరీతంగా ప్రదర్శిస్తోంది. దీంతో..  టీవీ చానళ్లలో సాక్షి -2గా టీవీ9 మారిపోయిందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో పడిపోతోంది.

టీవీ9ను.. గతంలో అన్ని పార్టీల వారు ద్వేషించేవారు. వైసీపీకి అనుకూలమని టీడీపీ.. టీడీపీకి అనుకూలమని.. వైసీపీ.. ఇలా రకరకాలుగా.. అన్ని పార్టీల వారు విమర్శించేవారు. దీనికి కారణం.. ఏ పార్టీని వదిలి పెట్టకుండా.. తన టీఆర్పీనే లక్ష్యంగా చూసుకుని.. టీవీ9 వార్తా ప్రసారాలు..చేసేది. కానీ యాజమాన్యం మారిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత… టీఆర్పీలు వస్తే.. చానల్‌ మాత్రమే నెంబర్ వన్ గా ఉంటుంది.. కానీ ప్రభుత్వాలను పొగడటం వల్ల అంతకు మించి ప్రయోజనం ఉంటుందని.. ఆశించినట్లుగా ఉన్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు.

టీవీ9 కొత్త యజమానులు.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రివర్స్ టెండర్లలో ప్రధాన లబ్దిదారులుగా ఉన్నారు. ప్రతి ప్రధాన ప్రాజెక్టుకు.. జరుగుతున్న రివర్స్ టెండర్లలో.. ఒకే సంస్థకు పనులు దక్కుతున్నాయి. ఆ సంస్థ వద్దనుకున్న .. చిన్నా చితకా పనులు మాత్రమే ఇతరులకు దక్కుతున్నాయి. ఈ క్రమంలో.. టీవీ9 ఇలా .. ప్రభుత్వాన్ని భుజాలపై మోయడంలో.. ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం.. రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ.. మీడియా విలువల సంగతేమిటనేదే ప్రశ్న. మీడియా విలువలకు.. ఓ విలువ కట్టి… దానికి తగ్గ లబ్దిని యాజమాన్యం చూసుకుంటోంది. అందుకే.. టీవీ9ని కూడా.. మరో సాక్షిగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చేసిందంటున్నారు.. వీక్షకులు.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, "ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా" అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర...

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి : జగన్

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... ప్రసంగించారు. ఈ సందర్భంగా...
video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

HOT NEWS

[X] Close
[X] Close