ఇంతింతై.. వటుడింతై…! టీవీ9కు పదిహేనేళ్లు..!

2004 సంక్రాంతి పండుగకు.. తెలుగువారికి అందుబాటులోకి వచ్చిన ఓ వినూత్న సమాచార విప్లవం టీవీ 9. అప్పటి వరకూ.. వినోద చానెళ్లలో గంటకోసారి వచ్చే ఐదు నిమిషాల వార్తలు లేకపోతే.. ఉదయం సాయంత్రం వచ్చే అర్థగంట న్యూస్ బులెటిన్లే అప్ డేట్స్ ఇస్తూ ఉండేవి. ఓ ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్ ఆలోచన.. అప్పుడప్పుడే అందరి మదిలోకి వస్తున్న సమయం అది. కానీ.. టెక్నికల్ గా చూస్తే.. ఓ సవాల్. అప్పటికే దేశవ్యాప్తంగా… విశేషమైన నెట్వర్క్ ఉన్న… ఈటీవీ .. ఓ ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్ ప్రారంభించడానికి ఆపసోపాలు పడుతున్న సమయం అది. ఏ నెట్ వర్క్ లేకుండా… రవిప్రకాష్ అనే జర్నలిస్ట్ తనకు తెలిసిన కొంత మంది సహచర జర్నలిస్టులతో కలిసి ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్ టీవీ 9 ఆలోచన చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన శ్రీనిరాజు నమ్మకాన్ని చూరగొని కొంత పెట్టుబడి సంపాదించగలిగారు. అదే వారికి ధైర్యం…. కానీ.. ఆత్మవిశ్వాసం మాత్రం అనంతం. ఫలితంగా .. ఫలితమే టీవీ 9 ఆవిర్భావం. కొత్త తరం మీడియా యుగంలో ఓ విప్లవం.

అందరూ వ్యతిరేకించేదే.. ! అందుకే నిష్పాక్షికమైనది..!

సహజంగా మీడియా ఎవరిదీ కానిది. అందరూ.. ఆ మీడియా సంస్థను అందరూ విమర్శిస్తున్నారంటే… ఆ సంస్థ నిజాయితీతో వ్యవహరిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే.. ఎటువంటి పక్ష పాతం లేకుండా.. వార్తలు ప్రసారం చేస్తూంటేనే.. ఇలాంటి పరిస్థితి వస్తుంది. టీవీ9ది అదే పరిస్థితి. ఇది టీడీపీ చానల్ అని… ఇతర పార్టీలు ఆరోపిస్తాయి. అది టీఆర్ఎస్ చానల్ అని మిగతా చానళ్లు చెబుతాయి. అదే సమయంలో జగన్ కు సపోర్ట్ చేస్తాడని.. చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. ఇలా అందరూ… వివిధ కోణాల్లో… టీవీ9ను విమర్శిస్తూనే ఉంటారు. ఈ విమర్శలే.. టీవీ 9ఎలాంటి పక్షపాతాన్ని చూపించడం లేదనడానికి సర్టిఫికెట్లు అనుకోవచ్చు. ఆ ఇమేజ్ అలా ఉంది కాబట్టే టీవీ 9 విశ్వసనీయంగా నిలబడింది.

సెన్సేషనలిజం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్న టీవీ 9..!

టీవీ 9 సెన్సేషనలిజానికి చిరునామా..! అందులో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే.. ఈ సెన్సేషనలిజం వల్లే టీవీ 9కి ఆ గుర్తింపు వచ్చింది. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు ఓ సంచలనం. ఆ పత్రిక ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కానీ పత్రికకు పరిమితులు ఇవే అంటూ.. ఎప్పుడూ మడికట్టుకు కూర్చోలేదు. కాబట్టే… అది ఓ లెజండరీ న్యూస్ పేపర్ గా నిలదొక్కుకుంది. అదే తరహాలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో… టీవీ 9 ప్రయత్నించింది. తనదైన సెన్సేషనలిజంతో… వార్తల్ని ప్రజెంట్ చేసింది. సృష్టించింది. ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ సెన్సేషనలిజంపై.. అనేక ఫిర్యాదులు ఉండవచ్చు గాక. కానీ అవన్నీ దుగ్ధతో చేసే విమర్శలే. టీవీ చానల్ అంటే… దినపత్రికలా… వార్తలు ఇస్తే సరిపోదు. దాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి. పత్రికల్లో అయితే.. అన్నీ అచ్చు వేస్తారు. ప్రజలు తమకు కావాల్సినవి చదువుకుంటారు. కానీ.. టీవీల్లో అది సాధ్యం కాదు. ప్రజలు చూసేవి వేస్తేనే చూస్తారు. ఆ టెక్నిక్ ను టీవీ 9 పట్టుకుంది. ఫలితంగా.. అనితర సాధ్యమైన విజయాల్ని నమోదు చేసింది. ప్రజల మద్దతు పొందింది. విమర్శలన్నీ సెకరండరీనే ప్రజలు ఆదరిస్తున్నారా లేదా అన్నదే కీలకం.

ఎన్ని చానళ్లొచ్చినా అందరికీ మార్గదర్శి టీవీ 9

ఎవరెన్ని చెప్పినా… టీవీ 9 బాటను.. అనుసరించని.. ఎలక్ట్రానిక్ మీడియా లేదంటే.. అతిశయోక్తి కాదు. పత్రికలా … టీవీని నడపాలనుకున్న రామోజీరావు… మినహ.. మిగతా.. తెలుగులో ప్రారంభమైన ప్రతీ టీవీ చానల్ కు . . టీవీ 9నే ఆదర్శం. ఆ టీవీ ఏ వార్త వేస్తే.. అది తమ చానళ్లలో రావాలని… పట్టుబట్టే యాజమాన్యాలకు కొదవలేదు. టీవీ 9లో ఆ వార్తను హైలెట్ చేశారు.. మనమెందుకు చేయలేదని… ఎడిటోరియల్ సిబ్బందిని వేధించే యాజమాన్యాలు కూడా ఉన్నాయి. అంతగా.. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంపై… టీవీ 9 తనదైన ముద్ర వేసింది. ప్రారంభమైన పదిహేనేళ్ల తర్వాత అదీ కూడా.. పుట్టగొడుగుల్లా టీవీ చానళ్లు పుట్టుకొచ్చిన తర్వాత… అదే టీవీ 9 ఆవిర్బావంలో కీలక పాత్ర పోషించిన వారెందరో.. ఆయా చానళ్లలో కీలక స్థానాల్లో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ… తెలుగు టీవీ చానల్ అంట్ టీవీ9నే.

పదిహేళ్లలో టీవీ 9 విజయాలనే కాదు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమించింది. కానీ.. ఇటీవలి కాలంలో యాజమాన్యం మారక తప్పలేదు. అప్పటి నుంచే కొత్త కొత్త సమస్యలు ఆ టీవీ చానల్ కు ఎదురవుతున్నాయి. దాని కి కారణం.. రాజకీయ ఒత్తిళ్లే. ఇప్పుడా పరిస్థితిని టీవీ 9 అధిగమించాల్సి ఉంది. ఇంతింతై.. వటుడింతై.. మరియు తానంతై.. అన్నట్లుగా పదిహేనేళ్లలో ఎదిగిన టీవీ 9కు దశాబ్దంన్నర విజయయాత్ర శుభాకాంక్షలు…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close