ట్వింకిల్… వైఫ్ ఆఫ్ అక్కీ..! మోడీకి పంచ్‌లే పంచ్‌లు..!

ఎన్నికల సమయంలో… మోడీని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్యూ చేశారు. అది.. వైరల్ అయింది. మామిడి పండ్లు అంటే ఇష్టమా.. అనే క్లిష్టమైన ప్రశ్నల దగ్గర్నుంచి చిన్నప్పుడు… చెంబులో నిప్పులేసుకుని ఇస్త్రీ చేసుకుటాననే మాటల వరకూ చాలా చెప్పారు మోడీ. ఆ అక్షయ్ కుమార్ భార్య.. ట్వింకిల్ ఖన్నా… మోడీని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు. అంతకు ముందులాగే.. ఇప్పుడూ వదిలి పెట్టడం లేదు.

మెడిటేషన్ ఫోటోగ్రఫీ అంటూ మోడీకి ట్వింకిల్ చురకలు..!

చివరి విడత ప్రచారం ముగిసిన తర్వాతి రోజు మోడీ కేదర్‌నాథ్‌ వెళ్లి ఆలయాలు దర్శించుకున్నారు. సరికొత్త దుస్తులతో మోదీ యోగా చేశారు. ధ్యానం చేశారు. ప్రధాని యోగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఫోజులపై ట్వీట్లు, కామెంట్లు, సెటైర్లు గుప్పించారు నెటిజన్లు. కొందరైతే.. మెమెలతో హల్‌చల్‌ చేశారు. ఇపుడు మోదీ యోగా సెషన్‌పై స్పందించారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా..! నేరుగా మోడీ పేరు ఎక్కడా ప్రస్తావించనప్పటికీ… ఇటీవల మేడిటేషన్‌, యోగా ఫోటోలు బాగా హల్‌చల్‌ చేస్తున్నాయని… తాను కూడా ట్రై చేస్తున్నానంటూ… యోగా అవతార్‌లో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మోడీకి అక్షయ్ సపోర్ట్.. ట్వింకిల్ రివర్స్..!

మెడిటేషన్‌ ఫోటోగ్రఫీ ఫోజులు, యాంగిల్స్‌ అంటూ తాను ఓ వర్క్‌షాప్‌ మొదలు పెట్టానన్నారు. అంతేకాదు.. వెడ్డింగ్‌ ఫోటోగ్రఫీ తర్వాత ఈ యోగా ఫోటోగ్రఫీ బాగుందంటూ ట్వీట్‌ చేశారు ట్వింకిల్‌ ఖన్నా. పేరు పెట్టకపోయినా.. మోడీ ధ్యానం చేసే టప్పుడు కూడా.. ఫోటోగ్రఫిని ఇష్టపడటంపై చురకలంటించారు. మోడీతో ఓ వైపు అక్షయ్‌కుమార్‌ చెట్టాపట్టాలేసుకొని ఉంటుంటే… ఆయన సతీమణి మాత్రం ప్రధానికి కౌంటర్‌ వేయడమే ఇక్కడ ఆసక్తికర అంశం. కానీ ట్వింకిల్‌ ఖన్నా… మోదీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. సోషల్‌ మీడియా వేదికల మీదుగా ప్రధానికి చురకలంటిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా మోడీనే అక్షయ్‌ను ఇంటర్యూలో అడిగారు.

ట్వింకిల్‌కు… సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ఫ్యాన్స్..!

అయినప్పటికీ.. ట్వింకిల్ మోడీని మాక్ చేయడం ఆపలేదు. అనేక సందర్భాల్లో ట్వింకిల్‌ ఖన్నా తన బ్లాగ్‌, ట్విట్టర్‌తో పాటు సోషల్‌ మీడియా వేదికల ద్వారా మోదీపై విమర్శలు గుప్పించారు. ఇపుడు ఆయన యోగా ఫోటోలకు అంతే సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు. ఏప్రిల్ ఫస్ట్ రోజు.. ప్రపంచం మొత్తానికి ఏప్రిల్‌ ఫూల్‌ డే ఏడాదికి ఒక్కసారే వస్తే… భారతీయులకు మాత్రం ప్రతి రోజు అచ్చేదిన్‌ పేరుతో ఫూల్స్‌ డేను జరుపుకుంటారని ఘాటుగానే విమర్శలు గుప్పిస్తారు. నిజానికి ట్వింకిల్ ఖన్నా స్ట్రెయిట్ ఫార్వార్డ్. అక్షయ్ కుమార్ ను సైతం.. పబ్లిక్‌గా ట్రోల్ చేస్తుంది. కానీ అక్కీ అన్నీ అర్థం చేసుకుని సర్దుకుపోతాడు. ఈ ట్వింకిల్ మాజీ హీరోయిన్ కూడా. తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన శీను సినిమాలో ఈమె హీరోయిన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

ఏపీలో 25 కాదు 26 జిల్లాలు..!?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లాల సరిహద్దులపై సిఫార్సు చేసేందుకు కమిటీ నియమించేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది....

తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.....

కేంద్రం చేతుల్లో “కూల్చివేత” ప్రక్రియ..!?

సచివాలయం కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఏదీ కలసి రావడం లేదు. కూల్చివేతకు పర్యావరణ అనుమతుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అనుమతులు అవసరమే లేదని వాదించింది. కూల్చివేత నిలిపివేయాలంటూ పిటిషన్ వేసిన...

HOT NEWS

[X] Close
[X] Close