భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో టైర్-2 నగరాలు కొత్త హాట్స్పాట్లుగా మారుతున్నాయి. ముంబై, గురుగ్రామ్ వంటి మెట్రో సిటీల్లో కనీసం రూ.3 కోట్లు ఉంటే తప్ప ఇల్లు లభించడం లేదు. కానీ లక్నో, దేరాడూన్, మొహాలీ, విశాఖ వంటి టైర్-2 సిటీల్లో అదే స్పెసిఫికేషన్లతో కూడిన 3-4 BHK ఫ్లాట్లు రూ. 70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు అందుబాటులో ఉన్నాయి.
ప్రాప్ ఈక్విటీ రిపోర్ట్ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో టైర్-2 సిటీల్లో హౌసింగ్ సేల్స్ వాల్యూ 6 శాతం పెరిగింది. లక్నో ఈ జాబితాలో టాప్లో ఉంది, యూనిట్స్ సేల్స్ 25 శాతం పెరిగాయి. టైర్ 2 నగరాల్లో ఫ్లాట్ ధరలు మెట్రోల కంటే 50-60% తక్కువగా ఉన్నాయి. రివర్స్ మైగ్రేషన్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్, మధ్యతరగతి ఆదాయాల పెరుగుదల , హోమ్ లోన్స్ వడ్డీ తగ్గుదల వంటివి టైర్ 2 నగరాల్లో డిమాండ్ పెరగడానికి కారణం అవుతున్నాయి
టైర్ 2/3 సిటీల్లో రెసిడెన్షియల్ సేల్స్ 2025 ప్రథమార్థంలో 20 శాతం పెరిగాయి. డిమాండ్ పెరుగుతూండటంతో బిల్డర్లు కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దాదాపుగా మూడు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే మెట్రోల్లో కొనలేని వారు.. టైర్ 2 సిటీల వైపు చూసే అవకాశం ఉంది.


