అమెరికాలో నిరుద్యోగ పర్వం..!

అగ్రరాజ్యం అమెరికాలో కరొనా కరాళ నృత్యం పీక్స్‌లో ఉండగానే… ఆ దేశం పరిస్థితి దిగజారిపోతోంది. ఆర్థికంగా కుంగిపోతోంది. వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. నిరుద్యోగిత అనూహ్యంగా పెరిగిపోతంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాది. ఎప్పుడూ దూసుకెళ్లడమే కానీ.. వెనక్కి తగ్గింది లేదు. కానీ.. ఇప్పుడు అత్యంత దారుణంగా .. ఊహించనంత వేగంగా కుంచించుకుపోతోందని.. నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ప్రజలు ప్రాణాలు పోయినా సరే.. లాక్ డౌన్ ప్రకటించకుండా.. నెట్టుకొస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నం రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయే అవకాశమే కనిపిస్తోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

అమెరికా చరిత్రలో అత్యంత గడ్డు పరిస్థితిని 1946లో ఎదుర్కొంది. అప్పుడు.. ఎకానమీ దారుణంగా పడిపోయింది. అప్పటికంటే ఇప్పుడు మరింత దారుణంగా పరిస్థితి మారుతుందని.. ప్రముఖ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో.. అమెరికా ఎకానమీ 5.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. రెండో క్వార్టర్‌లో 38 శాతం మేర నష్టపోతుందని శుక్రవారం నివేదిక వెల్లడించింది. ఇప్పటికే ఆ ప్రభావం అమెరికాపై కనిపిస్తోంది. అమెరికా నిరుద్యోగం రెండో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 15.7 శాతం ఉంటుందని తేలింది. రెండో త్రైమాసికంలో 21 మిలియన్ల ఉద్యోగాల కోత ఉంటుందనే అంచనాలున్నాయి. ఇది అత్యంత అసాధారణం.

అమెరికా అర్థిక వ్యవస్థ కుంగిపోతే.. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది. దాదాపుగా ప్రతీ దేశం… ఇబ్బంది పడుతుంది. చైనాలో ఎంత పరిస్థితులు మెరుగుపడినా.. ఎంత ఉత్పాదన చేసినా.. అగ్ర రాజ్య స్థాయికి ఎదగాలంటే… ఎగుమతులు బాగుండాలి. కానీ ఇతర దేశాల్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే.. చైనా ఉత్పత్తులు కొనేవారు లేకపోతే.. ఆ దేశం కూడా..అమెరికాను తోసి రాజని.. అగ్రరాజ్యంగా ఎదగడం సాధ్యం కాకపోవచ్చనేది నిపుణుల అంచనా. ఈ సవాల్‌ను అమెరికా ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు కీలకం. ట్రంప్.. మొండిపట్టుదలతో … మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తారో లేదో.. వేచి చూడాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close