దేశానికి ఆశాకిరణంగా విశాఖ మెడ్‌టెక్‌జోన్ ..!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వైద్య పరికరాల కొరత ఉంది. కరొనా అన్ని దేశాలను చుట్టుముట్టడంతో.. ఆరోగ్య పరంగా ఎంతో మెరుగైన సదుపాయాలున్న దేశమైనా.. కొత్త పరికాల కోసం చూస్తోంది. ఏ దేశానికి ఆ దేశం ఎగుమతుల్ని నిషేధిస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు.. దేశానికి విశాఖ మెడ్‌టెక్ జోన్ ఆశాకిరణంగా మారింది. మెడ్‌టెక్‌జోన్‌లో ప్రస్తుతం కోవిడ్ -19 టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేస్తున్నారు. 10వ తేదీ నుంచి ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయి. వీటి కారణంగా.. ఏపీలో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది. మెడ్ టెక్ జోన్ దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మారబోతోందని .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉండటంతో.. కార్ల కంపెనీల్లో.. వెంటిలేటర్లు తయారు చేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే ఒక్క మెడ్‌టెక్‌జోన్‌లోనే నెలకు 3వేల వెంటిలేటర్లు తయారు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ కిట్లు ఈనెలలో పదివేలు 10 వేల వరకు, మే నుంచి 25 వేల వరకు తయారు చేయొచ్చు. నిజానికి ఈ మెడ్‌టెక్ జోన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ మెడ్‌టెక్‌ జోన్‌కు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చిక్కులు ఏర్పడ్డాయి. టెస్టింగ్ ల్యాబ్స్‌ ఏర్పాటు కాకుండా.. చిక్కులు ఏర్పడ్డాయి. సంస్థ సీఈవో జితేందర్ శర్మను.. రెండు సార్లు తొలగించిన ఏపీ సర్కార్.. చివరికి మళ్లీ నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో… గత పది నెలలుగా మెడ్ టెక్‌జోన్‌ అభివృద్ది జరగలేదు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మెడ్ టెక్ జోన్‌లో ఉన్న సంస్థలే…ఆశాకిరణంగా కనిపిస్తూడటంతో.. కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఉత్పత్తులు మార్కెట్లోకి రాక ముందు వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సి ఉంటుంది. వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసే విషయంలో చిక్కులు తెచ్చి పెట్టారు. ఇప్పుడు శరవేగంగా ఆటంకాలు తొలగించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close