కలాంని గౌరవించిన ఐక్యరాజ్యసమితి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రభావం కేవలం భారతదేశంపైనే కాదు యావత్ ప్రపంచంపై కూడా ఉందని నిరూపిస్తూ ఆయన జన్మదినమయిన అక్టోబర్ 15వ తేదీని విద్యార్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహార్ లాల్ నెహ్రూ తరువాత పిల్లలతో, విద్యార్ధులతో అంతగా మమేకమయిన వ్యక్తి అబ్దుల్ కలాం మాత్రమేనని చెప్పవచ్చును. ఆయనకు రక్షణ, విమాన, అంతరిక్ష రంగాలలో చాలా విపరీతమయిన అభిమానం, ఆసక్తి ఉన్నప్పటికీ, తను అమితంగా ఇష్టపడేది మాత్రం పిల్లలతో కలిసి గడుపుతూ వారికి పాఠాలు చెప్పడమేనని ఆయనే స్వయంగా చెప్పేవారు. 2007సం.లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత ఆయన దేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్ధులలో స్ఫూర్తి నింపేవారు. చివరికి ఆయన తన చివరి గడియలలో కూడా షిల్లాంగ్ ఐ.ఐ.యం.   విద్యార్ధుల ముందు ప్రసంగిస్తూ అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలి తుది శ్వాస విడిచారు. కులమతప్రాంతాల అడ్డుగోడలు తొలగించుకొని భారతీయులందరూ సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఆయన అభిలాషించేవారు. స్పూర్తిదాయకమయిన ఆయన హితోక్తులను మన రాజకీయ నాయకులు పట్టించుకోకపోయుండవచ్చును. కానీ ఆయన మాటలతో ప్రేరణ పొందినవారు దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్ధులున్నారు. విశ్వమానవ సౌబ్రాతత్వం కోరుకొన్న ఆ మహనీయుడికి ఐక్యరాజ్యసమితి కూడా ఘన నివాళులు అర్పించి ఆయన జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close