కొరివితో తలగోక్కున్న తెరాస !

సంపన్న రాష్ట్రం, సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రమని డంకా బజాయించే తెరాసకు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే అంత గుబులెందుకో అర్థం కావడం లేదు. ఏకంగా 25 లక్షల మంది సీమాంధ్ర ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి పన్నాగం పన్నిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా ఓట్ల తొలగింపు బాగోతాలు బయటపడుతున్నాయి.

సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్ గిరి తదితర నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగించారు. నోటీసు ఊసే లేకుండా నిరంకుశంగా వ్యవహరించారు. అడిగే వారే లేరన్నట్టు ఆటవిక రాజ్యాన్ని తలపించేలా అధికారులు వ్యవహరించారు. వెనక ఎవరో బలవంతులు లేకపోతే ఇంత అడ్డగోలుగా ఓట్లను తొలగించే ధైర్యం అధికారులకు ఎక్కడిది?

నిన్న మొన్నటి వరకూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సోమేష్ కుమార్ తెరాస కార్యకర్తలా వ్యవహరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెరాస నాయకత్వం సూత్రధారి అయితే సోమేష్ కుమార్ ప్రధాన పాత్రధారిగా ఓట్ల తొలగింపు జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన్ని బదిలీ చేసినంత మాత్రాల పాపం పరిహారం కాదని ప్రతిపక్ష నేతలు, ప్రజలు దుయ్యబడుతున్నారు. ఒక కమిషనర్ ఇంత అరాచకంగా లక్షల ఓట్ల తొలగింపు అనే కుట్రలో రాజకీయ పార్టీ కార్యకర్త స్థాయిలో భాగస్వామి కావడం ఏమిటని కాంగ్రెస్, తెదేపా సహా మొత్తం విపక్షం ఏకతాటిపై నిలిచి ప్రశ్నిస్తోంది.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, 25 లక్షల సీమాంధ్ర ఓట్లను తొలగించడానికి కేసీఆర్ కుట్ర పన్నారా? దీనికి ఆయనే జవాబు చెప్పాలి. అయితే, ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరిగిన తీరు చూసి ఈసీ అధికారులు విస్తుపోతున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం వారిని టార్గెట్ చేసి ప్రజల ఓటు హక్కును కాలరాయడం ఎంత నిస్సిగ్గుగా జరిగిందో వారు గమనిస్తున్నారు. చివరకు, తెరాస మిత్రపక్షం ఎం ఐ ఎం కూడా ఓట్ల తొలగింపు తీరుపై ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బహుశా ఒక్క నగరంలోనే 25 లక్షల ఓట్ల తొలగించడానికి కుట్ర జరిగిందనే భారీ ఆరోపణ భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం మీదా వచ్చి ఉండదు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆ అపప్రధను మూటగట్టుకుంది మరోవైపు, జనవరిలోగానీ ఎన్నికలు జరపలేమని ప్రభుత్వం చెప్తోంది. గ్రేటర్ లో ఓటమి ఖాయమని తెరాస చేష్టలే స్పష్టం చేస్తున్నాయనే ప్రతిపక్షాల దూకుడు విమర్శలను సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితి గులాబీ శ్రేణుల్లో లేదు. తమ గెలుపు అనుమానమేనని చాలా మంది తెరాస నేతలు ఆఫ్ ది రికార్డుగా ఒప్పుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే మరోసారి టీడీపీ, బీజేపీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీ అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. తెరాసకు కోలుకోలేని షాకిచ్చి సత్తాను చాటుతామంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. అధికార తెరాస శ్రేణులు మాత్రం గుబులు గుబులుగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ మారడం లేదని తేల్చేసిన పర్చూరు ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు....

జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ...

బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని... నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు....

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

HOT NEWS

[X] Close
[X] Close