హీరోలు చేయలేనిది ఉపాసన చేశారు..!

దక్షిణాదిలో సినీ దిగ్గజాల్లేరా..? ప్రాంతీయ భాషల హీరోల్లో లెజెండ్స్ అయినా గుర్తింపునకు నోచుకోరా..? భారతీయ చిత్ర పరిశ్రమ అంటే.. కేవలం బాలీవుడ్‌ని మాత్రమే గుర్తించాలా..? ఇవన్నీ… నిన్నటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ చిత్ర పరిశ్రమల్లో వస్తున్న సందేహాలు., ఎందుకంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా త‌న నివాసంలో భారతీయ చిత్ర ప్రముఖులకు ప్రత్యేక‌మైన విందునిచ్చారు. ఇందులో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఒక్కరంటే.. ఒక్కరు కూడా లేరు. బాలీవుడ్‌లో ఓ మాదిరి నటులకూ ఆహ్వానం దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో మోడీ ప్రత్యేకమైన భేటీ అంటూ.. బీజేపీ కూడా దీన్ని ప్రచారం చేసుకుంది.

ద‌క్షిణాదిన బాలీవుడ్‌తో సైతం నాలుగు చిత్ర ప‌రిశ్రమ‌లోని ఏ ప్రముఖుడికి ఆహ్వానం అంద‌లేదు. అయితే.. ఎవరికీ నోరు తెరిచి అడిగే ధైర్యం రాలేదు. ఒక్కరంటే.. ఒక్కరూ.. దీనిపై.. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించలేదు. కానీ… సినీ పరిశ్రమతో పరోక్షంగా సంబంధం ఉన్న ఉపాసన కామినేని మాత్రం స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామచరణ్ సతీమణి ఉపాసన.. ఈ విషయంలో… తన ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్‌ ద్వారా ఏ మాత్రం భయపడకుండా… తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించారు. ” ద‌క్షిణాది వారికి మీరంటే ఎంతో గౌర‌వం. మీరు ప్రధానిగా ఉండ‌టం ప‌ట్ల మేం గ‌ర్విస్తున్నాం. గొప్ప వ్యక్తుల‌ను గుర్తు చేసే కార్యక్రమాల‌ను కేవ‌లం హిందీ న‌టీన‌టులకు మాత్రమే ప‌రిమితం చేశారు. ద‌క్షిణాది న‌టీన‌టుల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చాలా బాధ‌తో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని” పోస్ట్ చేశారు.

ఉపాసన కామినేని ఆవేదనలో అర్థం ఉందని.. ఇతర చిత్ర పరిశ్రమలోని అందరికీ తెలుసు. కానీ వారెవరూ.. బహిరంగంగా కూడా.. ఉపాసనకు మద్దతు పలికే పరిస్థితి లేదు. అయితే. నెటిజన్లకు మాత్రం.. ఇలాంటి శషబిషలులేవు కాబట్టి.. ఉపాసనకు మద్దతుగా నిలుస్తున్నారు. చిత్ర పరిశ్రమ అంటే.. ఇప్పటికీ .. ఒక్క హిందీనే గుర్తించే పరిస్థితి ఉండటం దురదృష్టకరమంటున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి కేజీఎఫ్, తెలుగు నుండి బాహుబలి, తమిళం నుండి రోబో లాంటి సినిమాలు.. ఉత్తరాదిన దున్నిపడేశాయి. ఇప్పుడు దక్షిణాదిన రెడీ అవుతున్న సినిమాలు కూడా… ఉత్తరాదిన పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. అయినా.. కేంద్రం ఇప్పటికీ… హిందీ పరిశ్రమను మాత్రమే గుర్తించడానికి.. ఇష్టపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close