హైదరాబాద్ కంపెనీ “మెగా హవాలా” లింకులు ఎక్కడ?

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వందల కోట్ల రూపాయనలు .. అదే స్థాయిలో వివిధ రకాల హవాలా మార్గాల్లో తరలించిందని.. ఐటీ నిర్ధారించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అసలు ఆ హైదరాబాద్ కంపెనీ ఏది..? అంత పెద్ద మొత్తంలో హవాలా ఎలా చేయగలిగింది..? అసలు ఎవరి కోసం చేసింది..? అనేది .. జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. కానీ.. తరచి చూస్తే… జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. రోజువారీ పరిణామాలపై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికి.., లోగుట్టేమిటో ఇట్టే తెలిసిపోతుంది.

ఎన్నికల్లో ధన ప్రవాహం ఆ కంపెనీ హవాలా పుణ్యమేనా..?

ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ధన ప్రవాహం చోటు చేసుకుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలతో ప్రారంభించిన ఈ ధన ప్రవాహం.. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ సాగింది. అసలు అంత డబ్బు.. ఎలా జనజీవనంలోకి వస్తోంది..? అని.. బ్యాంకింగ్ రంగంలోని వారు కూడా ఆశ్చర్యపోయేంతగా వరద పారింది. పలు నిఘా సంస్థలు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయని నిర్ధారించాయి. అంత సొమ్ము సాధారణంగా అధికార పార్టీలకే ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీల నుంచి సాయం పొందిన వ్యాపార సంస్థలు… ఒప్పందాల ప్రకారం.. అలా డబ్బు పంపిణీ ఏర్పాట్లు చేస్తాయి. ఈ క్రమంలో… హైదరాబాద్ కంపెనీ కూడా.. ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

వందలు.. వేల కోట్లంటే… కచ్చితంగా పాలకుల కరుణ ఉండాల్సిందే..!

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఓ బడా కాంట్రాక్టర్ … ఎన్నికల ఖర్చులన్నీ చూసుకున్నారని…. జోరుగా ప్రచారం జరిగింది. ఆ కాంట్రాక్టర్‌కు… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన కాంట్రాక్టులు, ప్రాజెక్టులన్నీ దక్కాయి. దక్కుతున్నాయి. కొత్తగా ఇతర రంగాల్లోనూ ఆయన పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కృతజ్ఞతగానే.. ఆ కంపెనీ… సొమ్మును హవాలా మార్గాల ద్వారా ఎన్నికల అవసరాల కోసం.. ఆయా పార్టీలకు తరలించినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ గుట్టు మొత్తం ఇప్పుడు ఐటీ దాడుల్లో బయటపడిందని తెలుస్తోంది.

ఎవరెవరి గుట్టు బయటకు వస్తుందో..?

నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం.. ప్రతీ రూపాయి.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో.. లెక్కలు పట్టగలిగే వ్యవస్థను రెడీ చేసుకుంది. గతంలోలా… నగదు చెలామణితో.. రాజకీయాలు చేయగలిగే పరిస్థితులు లేవు. ఎదైనా అకౌంటబులిటీ ఉంది. అందుకే.. రాజకీయ నేతలు.. మరింతగా రాటుదేలిపోయి.. ఇలాంటి కంపెనీలకు ఆయాచిత లబ్ది చేకూర్చి వారి ద్వారా.. నిధుల సాయాన్ని హవాలా మార్గాల ద్వారా పొందుతున్నారు. కానీ..ఈ విషయమూ.. ఐటీ, సీబీడీటీ వర్గాలకు తెలిసిపోయింది. అందుకే సులువుగానే పట్టేసుకున్నారు. జాతకాలను లాగేస్తున్నారు. ఈ గుట్టులో .. ఎవరెవరి రట్టు బయట పడుతుందో.. వెయిట్ అండ్ సీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com