త‌లుపులూ తాళాలూ వ‌దిలేసి.. రాష్ట్రానికి ప‌నికొచ్చేవి క‌న్నా మాట్లాడ‌లేరా?

టీడీపీకి త‌లుపు మూసేశాం, ప్ర‌ధాని మోడీ గొళ్లెం పెడితే, అమిత్ షా పేద్ద‌ తాళం వేశారు, రాష్ట్రంలో టీడీపీ అల్లల్లాడిపోతుంది, మిగులున్న నాయ‌కుల‌కు భాజ‌పా మాత్ర‌మే దిక్కు, ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల్ని లాగేశాం, ఇంకా కొంద‌ర్ని లాక్కుంటాం, ఆ త‌రువాత రాష్ట్రంలో తామే రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయం…. ఇదీ ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేస్తున్న వ్యాఖ్యల్లోని సారాంశం. రాష్ట్రంలో పార్టీ ఎదుగుద‌ల‌కు వ్యూహ‌మేంట‌య్యా అంటే ఇదిగో ఇదే అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో ఎట్టి ప‌రిస్థితుల్లో పొత్తు ఉండ‌దుగాక ఉండ‌దంటూ క‌న్నా మ‌రోసారి చెప్పారు. టీడీపీతో పొత్తు త‌ప్ప వేరే అంశం లేన‌ట్టుగా మాట్లాడుతున్నారు. అదొక్క‌టే భాజ‌పా బ‌లాన్ని పెంచగ‌లిగే అంశం అన్న‌ట్టుగా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ త‌లుపులు మూసేశారు అనే వ్యాఖ్య‌ల వ‌ల్ల ఆంధ్రాలో భాజ‌పా ఎదిగే అవ‌కాశం ఉందా…? అది ప్ర‌జాభిప్రాయాన్ని భాజ‌పాకి అనుకూలంగా ఎలా మార్చ‌గ‌ల‌దు..? ఒక పార్టీ ఎదుగుద‌ల‌కు ఇలాంటి మాట‌లే స‌రిపోతాయా, చేత‌ల్లో ఏమీ అవ‌స‌రం లేదా..?

కేంద్రంలో అధికారంలో ఉన్నాం, గ‌తంలో ఏపీ విభ‌జ‌న‌కు సాయ‌ప‌డ్డాం, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్రానికి చాలా ఇస్తామ‌న్నాం, అవ‌న్నీ కేంద్రం నుంచి ర‌ప్పించుకుందాం, త‌ద్వారా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌నే ఆలోచ‌న రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏ కోశానాలేదు అనేది ప‌దేప‌దే నిరూపితం అవుతూనే ఉంటుంది. శాస‌న‌స‌భ‌లో ప్రాతినిధ్యం లేదు, గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నీసం నోటాకి వ‌చ్చినన‌న్ని ఓట్లు కూడా మ‌న‌కి ప‌డ‌లేదు, దేశవ్యాప్తంగా మోడీ హ‌వా ఎలా ఉన్నా ఆంధ్రా ప్ర‌జ‌ల్లో ఇంత తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది అనే ఆత్మ‌విమ‌ర్శ చేసుకోకుండా ఇప్ప‌టికీ అదే ధోర‌ణిలో ముందుకెళ్తున్నారు.

పోల‌వ‌రం డీపీఆర్ టు అంశం ఆర్థిక శాఖ ద‌గ్గ‌ర పెడింగ్ లో ఉంది. ఆ నిధులు విడుద‌లైతేగానీ ఇక్క‌డ ప‌నులు ప్రారంభం కావు. అవి తెప్పించి ప‌నులు వేగ‌వంతం చేయించ‌గ‌లిగితే భాజ‌పా ఎద‌గ‌దా..? ఆ సంగ‌తి క‌న్నాకి తెలియంది కాదు, కానీ దాని గురించి మాట్లాడ‌రు. రాజ‌ధాని అమ‌రావ‌తి మీద తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. మంత్రి బొత్స రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తారు. దానిపై స్పందించ‌రు! ప్ర‌ధాని మోడీయే క‌దా శంకుస్థాప‌న చేశారు, ఆయ‌నే క‌దా ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా క‌ట్టేస్తామ‌న్నారు. కేంద్ర‌మే క‌దా రాజ‌ధాని నిధులు ఇవ్వాలి? అవి విడుద‌ల‌య్యేలా చేస్తే… రాజ‌ధాని నిర్మాణ ప‌నులు ముందుకు సాగుతాయి. ఆ నిధులును మేమే ఇచ్చామ‌ని ప్ర‌చారం చేసుకుంటే భాజ‌పా ఎద‌గ‌దా..? అయినా రాజ‌ధాని అంశం క‌న్నాకి అన‌వ‌స‌రం. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల అమ‌లుపై క‌న్నా దృష్టి పెడితే… రాష్ట్రంలో భాజ‌పాను అభిమానించేవారు పెరుగుతారు. అంతేగానీ, మోడీ టీడీపీకి త‌లుపులు మూసేశాం, తాళాలు వేసేశాం అని ప‌దేప‌దే చెప్ప‌డం వ‌ల్ల ఏమాత్ర‌మూ ఉప‌యోగం ఉండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close