ఉపేంద్ర పేరు ఖ‌రారు చేసేసిన మెగా హీరో

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా కిర‌ణ్ కొర్ర‌పాటి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అందుకోసం వ‌రుణ్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈసినిమాలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర కూడా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ విష‌య‌మై చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే వ‌రుణ్ ట్వీట్ తో ఈ సినిమాలో ఉపేంద్ర ఎంట్రీ ఖాయ‌మైపోయింది.

ఈరోజు ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ ఓ ట్వీట్ చేశాడు. ఉపేంద్ర‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూనే, `మీతో క‌లిసి న‌టించ‌డానికి ఎదురుచూస్తున్నా` అని ట్వీటాడు. దాంతో. ఈ సినిమాలో ఉపేంద్ర ఎంట్రీ ని అధికారికంగా ఖరారు చేసిన‌ట్టైంది. త్వ‌ర‌లోనే ఈసినిమా షూటింగ్ మొద‌లుకాబోతోంది. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి `ఎఫ్ 3` షూటింగ్ మొద‌లెడ‌దామ‌ని భావిస్తున్నాడు వ‌రుణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

HOT NEWS

[X] Close
[X] Close