ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు ఎవ‌రికీ అంత టైమ్ లేదు. ఒక‌ర్ని న‌మ్ముకోవ‌డం, వాళ్ల‌కు ఆ పాట అప్ప‌జెప్ప‌డం, వాళ్ల‌తోనే రెండు మూడు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇదే తీరు.

కానీ `ఉప్పెన‌` విష‌యంలో మ‌ళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. వైష్ణ‌వ్ తేజ్ హీరో. ఇప్ప‌టికి రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. `నీ క‌న్ను నీలి స‌ముద్రం` పాటైతే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోయింది. రెండో పాట `థ‌గ్ థ‌గ్‌..` కూడా ఓకే అనిపించుకుంది. దాంతో ఈ ఆల్బ‌మ్ పై అంచ‌నాలు పెరిగిపోయాయి. అందుకే దేవి ఇచ్చిన ఓ మంచి ట్యూన్‌ని ఏకంగా న‌లుగురు గీత ర‌చ‌యిత‌ల‌కు ఇచ్చాడ‌ట ద‌ర్శ‌కుడు. చంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌, శ్రీ‌మ‌ణి, బాలాజీ..ల‌తో ఈ పాట రాయించుకున్నార్ట‌. వాళ్ల‌లో రామ‌జోగ‌య్య పాట అద్భుతంగా కుదిరింద‌ని టాక్‌. దాన్ని సుకుమార్ ఓకే చేసి, దేవికి పంపితే.. `నాకు ఈ పాట వ‌ద్దు…` అని దేవి తిర‌స్క‌రించాడ‌ని తెలుస్తోంది. ఈ పాట విష‌యంలో దేవి – సుక్కు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డార్ట‌. సుకుమార్ రామ‌జోగ‌య్య వైపు ఉంటే.. దేవి మాత్రం `మ‌రొక‌రితో మ‌రో వెర్ష‌న్ రాయించండి` అని చెప్పాడ‌ని టాక్. రామ‌జోగ‌య్య రాసిన పాట నిజంగానే దేవికి న‌చ్చ‌లేదా? లేదంటే రామ‌జోగ‌య్య ఇచ్చిన పాట తీసుకోవ‌డం దేవికి ఇష్టం లేదా? అనేది సుకుమార్ తేల్చుకోలేక‌పోయాడ‌ని, అందుకే.. `ఈ పాట విష‌యంలో ఎలాంటి నిర్ణ‌య‌మైనా నువ్వే తీసుకో..` అని బాధ్య‌త అంతా బుచ్చిబాబుకే అప్ప‌గించేసిన‌ట్టు టాక్‌. న‌లుగురితో పాట రాయించినా, ఎవ‌రి పాట ఓకే చేశారో, ఆయా గీత ర‌చ‌యిత‌ల‌కే చెప్ప‌లేద‌ని, ఆ పాట బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ.. ఎవ‌రి పాట ఉంటుందో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ పాట బ‌య‌ట‌కు రాబోతోంది. మ‌రి ఎవ‌రి వెర్ష‌న్ ఉంటుందో? ఎవ‌రి మాట నెగ్గించుకున్నారో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close