ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా కూడా చేరింది. `అశ్వ‌ద్ధామ‌` ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ్ తేజ్ చెప్పిన క‌థ‌ని క‌ల్యాణ్ ఓకే చేశాడు. ఈరోజే ఎగ్రిమెంట్లు పూర్త‌య్యాయి. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత‌.

సినిమాలైతే ఓకే అవుతున్నాయి గానీ, క్రేజీ కాంబినేష‌న్‌ని మాత్రం సెట్ చేసుకోలేక‌పోతున్నాడు మెగా అల్లుడు. `విజేత‌` ఫ్లాప్ అయ్యింది. `సూప‌ర్ మచ్చీ`కి కూడా భారీగా రిపేర్లు జ‌రుగుతున్నాయిని టాక్‌. నాగ‌శౌర్య‌ `అశ్వ‌ద్ధామ‌` గొప్ప‌గా ఏం ఆడ‌లేదు. అయినా స‌రే… ర‌మ‌ణ‌తేజ్ కి ఛాన్స్ ఇచ్చాడు. హీరోలంతా.. హిట్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతుంటే… విచిత్రంగా తాను మాత్రం ఫ్లాప్ ద‌ర్శ‌కుల్ని ఏరి కోరి ఎంచుకుంటున్నాడు అదేం స్ట్రాట‌జీనో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

HOT NEWS

[X] Close
[X] Close