వరద సాయం టీఆర్ఎస్‌కు ప్లస్ కాదు మైనస్..!

తెలంగాణ రాష్ట్ర సమితికి ఏదీ కలిసి రావడం లేదు. దుబ్బాకలో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్న ప్రచారం ఓ వైపు సాగుతూండగానే.. హైదరాబాద్‌లో తమ నేతల చేతివాటంతో ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తోంది. వరదల కారణంగా ఇబ్బంది పడిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ. పదివేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు పంపిణీ కూడా ప్రారంభమయింది. వీలైనంత త్వరగా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేయడంతో .. టీఆర్ఎస్ స్థానిక నేతల ప్రమేయం ఎక్కువగా ఉంది. అది అవినీతికి కారణం అయింది. అనేక బస్తీలలో ఎలాంటి ఆర్థి సాయం అందకపోగా… అరకొరగా అందిన చోట… టీఆర్ఎస్ సానుభూతిపరులన్న కుటుంబాలకే సాయం చేశారు.

దీంతో ఓ బస్తీలో వంద కుటుంబాలు ఉంటే.. పది కుటుంబాలే సాయం పొందాయి. మిగతా 90 కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యాయి. ఆ పది కుటుంబాలైనా ప్రభుత్వంపై సానుభూతితో ఉన్నాయా అంటే అదీ లేదు. వారికి రూ. పదివేల సాయం పేరుతో… ఇచ్చింది రూ. ఐదు వేలు మాత్రమే. కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఇచ్చారు. స్థానిక నేతలందరూ తమ తమ వాటాలు పంచుకోవడంతో ఆ సాయం చిక్కిపోయింది. చివరికి ఆ సాయం వ్యవహారం మొత్తం ప్రహసనంగా మారిపోయింది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తూండటంతో ప్రభుత్వంలోనూ కలవరం ప్రారంభమయింది. వెంటనే… సాయం అందచేసే ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించారు.

పక్కాగా.. రికార్డులు సేకరించి.. బాధితులకు పరిహారం అందించాలని భావిస్తున్నారు. అయితే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది. ప్రభుత్వం తమను ఆనేక విధాలుగా వంచించిందని.. ఇప్పుడు వరద సాయం పేరుతోనూ అదే పని చేశారన్న అభిప్రాయం బస్తీ వాసుల్లో ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రజల్లో సానుకూలత పెంచుకునేందుకు కేసీఆర్ వేసిన సాయం ప్లాన్.. ఇలా దారి తప్పిందనే ఆందోళన టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close