ఒక్క సారిగా ఎదిగి పాతాళంలోకి పడిపోయిన ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్‌ను అప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. అప్పు తీసుకుని చెల్లించకుండా తప్పించుకోవడంతో చెందిన గ్లాస్ ట్రస్ట్ LLC అనే అమెరికన్ లెండర్ కోర్టుకెళ్లింది. దీంతో రవీంద్రన్ వ్యక్తిగతంగా 1 బిలియన్ డాలర్లు అంటే సుమారు 8,400 కోట్ల రూపాయలు చెల్లించాలని అమరెికా కోర్టు తీర్పు చెప్పింది.
2021లో బైజూస్ ఆల్ఫా అనే సబ్సిడరీ సంస్థను రవీంద్రన్ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ లెండర్ల నుంచి నిధులు సేకరించారు. గ్లాస్ ట్రస్ట్ నుంచిచ 1 బిలియన్ డాలర్లు టర్మ్ లోన్ తీసుకున్నారు. తర్వాత ఆ నిధుల్ని అక్రమంగా ఇతర కంపెనీలకు, దేశాలకు మళ్లించారు. దీంతో లెండర్లు అమెరికా కోర్టును ఆశ్రయించారు. కోర్టు మొదట డిస్కవరీ ఆర్డర్లు జారీ చేసింది. కానీ రవీంద్రన్ పట్టించుకోలేదు. దీంతో, వాదనలు వినే అవకాశం ఇవ్వకుండా డిఫాల్ట్ జడ్జ్మెంట్ జారీ చేశారు.
అయితే బైజూస్ ను పూర్తిగా దివాలా తీయించిన రవీంద్రన్ ఇప్పుడు ఇండియాలో లేరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2024లో ‘లుక్ అవుట్ నోటీస్’ జారీ చేసింది. అప్పటికే దేశాన్ని వదిలి వెళ్లిన రవీంద్రన్, తన కంపెనీ ఆర్థిక సమస్యలు, చట్టపరమైన కేసుల మధ్య దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. అప్పులు మొత్తం ఎగ్గొట్టి తన వద్ద ఉన్న డబ్బులతో బతికేయాలని అనుకుంటున్నట్లుగాతెలుస్తోంది.