భారత విద్యార్థులు అమెరికాకు వెళ్లడం తగ్గిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య 33 శాతం తగ్గిపోయిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో ఎఫ్-1 వీసాల జారీ 2023లో 89,000 నుండి 2024లో 59,000కి పడిపోయింది. ఇది దాదాపు 33 శాతం తగ్గుదలను సూచిస్తుంది. ఈ ఏడాది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్ తో పాటు అనేక ఆంక్షలు పెడుతూండటంతో అమెరికా చదువులపై తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు.
అదే సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌పై ఆంక్షలు పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి కూడా పెరుగుతోంది. దాంతో విద్యార్థులు యూరప్ దేశాల వైపు చూస్తున్నారు. కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, ఫ్రాన్స్ , యూకే వైపు వెళ్లే వారు పెరిగారు. ఈ దేశాలు తక్కువ ట్యూషన్ ఫీజులు , మెరుగైన పోస్ట్-స్టడీ వర్క్ అవకాశాలను అందిస్తున్నాయని విద్యారంగంలో నిపుణులైన వారు చెబుతున్నారు. కెనడాలో 2024లో భారతీయ విద్యార్థుల సంఖ్య 15 శాతం, జర్మనీలో 20 శాతం పెరుగుదల నమోదు అయింది.
అమెరికాలో పరిస్థితులతో పాటు యూఎస్‌లో ఉన్నత విద్య ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయం, బీమా ఖర్చులు య విద్యార్థులకు ఆర్థిక భారంగా మారాయి. దీనికి తోడు, రూపాయి విలువలో తగ్గుదల కూడా ప్రభావం ఇమ్మిగ్రేషన్ విధానాలపై స్పష్టత లేకపోవడం విద్యార్థులలో అభద్రతాభావాన్ని పెంచుతోంది. హెచ్-1బీ వీసా ప్రక్రియలో మార్పులు , డీపోర్టేషన్పై ఆందోళనలు కూడా తగ్గుదలకు కారణం అవుతున్నాయి.