తెరాస నేత‌లు ట‌చ్ లో ఉన్నారంటున్న ఉత్త‌మ్..!

ట‌చ్ లో ఉంటున్నారు… ఈ మాట తెరాస నేత‌ల గురించి భాజ‌పా నేత‌లు చెబితే కొంత న‌మ్మ‌శ‌క్యంగా ఉంటుంది! కాంగ్రెస్ నేత‌లు మాతో ట‌చ్ లో ఉంటున్నార‌ని భాజ‌పా నేత‌లు చెప్పినా న‌మ్మ‌డానికి ఆస్కారం ఉంటుంది. అంతేగానీ, తెరాస నేత‌లు త‌మ‌లో క‌లిసేందుకు సిద్ధంగా ఉన్నార‌నీ ట‌చ్ లో ఉంటున్నార‌ని టి. కాంగ్రెస్ నేత‌లు చెబితే… ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎవ‌రు న‌మ్ముతారు? అవునా… తెరాస నాయ‌కులు మ‌న పార్టీకి ట‌చ్ లో ఉన్నారా అని ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌రిస్థితి కాంగ్రెస్ నాయ‌కుల్లో ఉన్నా ఆశ్చ‌ర్యం లేదు! ట‌చ్ లో ఉంటున్నారు… అనే ఈ వ్యాఖ్య మీద అంద‌రిలోనూ ఇంత క్లారిటీ ఉంటే, టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇదే వ్యాఖ్య చేశారు!

సూర్యాపేట‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ… త్వ‌ర‌లోనే తెరాస‌లో విస్ఫోటం త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్, ఎమ్మెల్యేలు ష‌కీల్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి… ఈ మ‌ధ్య తెరాస అధినాయ‌క‌త్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన నేత‌ల వ్యాఖ్య‌లను గ‌మ‌నిస్తే ప‌రిస్థితి అర్థ‌మౌతుంద‌న్నారు! తెరాస‌లో చాలామంది నాయకులు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌నీ, తెరాస‌లో అసంతృప్తులు త‌మ‌వైపే చూస్తున్నార‌ని ఉత్త‌మ్ చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌న్నారు. పోలీసుల సాయంతో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై లేనిపోని కేసులు బ‌నాయిస్తున్నార‌నీ, వీటిపై త్వ‌ర‌లోనే పోరాటం చేస్తామ‌ని ఉత్త‌మ్ చెప్పారు.

తెరాస‌లో అసంతృప్తులు వ్య‌క్త‌మైనమాట నిజ‌మే. ఉత్త‌మ్ చెప్పిన ఆ నలుగురు తెరాస నేత‌ల్లో ఒకరైన ష‌కీల్, భాజ‌పా ఎంపీ అర‌వింద్ తో క‌లిసి మాట్లాడారు కూడా. అయితే, తెరాస‌లో అసంతృప్తులకు దాన్ని వెళ్ల‌గ‌క్కే నైతిక స్థైర్యాన్ని ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. భాజ‌పా బ‌లం పుంజుకుంటుంద‌నే అభిప్రాయం మెల్ల‌గా బ‌ల‌ప‌డుతోంది కాబ‌ట్టి, ప్ర‌త్యామ్యాయంగా కేంద్రంలో అధికార పార్టీ ఉంద‌నే ఒకింత ధీమా కొంత‌మంది తెరాస నేత‌ల్లో వ్య‌క్త‌మౌతున్న ప‌రిస్థితి. అంటే, ఈ విష‌యంలో కాంగ్రెస్ వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పార్టీ మారాల‌నుకునే తెరాస నేత‌ల‌కు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ భాజ‌పా. ఆ త‌రువాతి స్థానంలో కాంగ్రెస్ ఉంద‌ని చూస్తున్నారా అనేది అనుమాన‌మే! ఇవ‌న్నీ ఇంత స్ప‌ష్ట‌గా అంద‌రికీ క‌నిపిస్తుంటే.. మాతో ట‌చ్ లో ఉన్నారు అనే వ్యాఖ్య ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల‌ని ఉత్త‌మ్ ప్ర‌య‌త్నిస్తుంటే అంత‌కంటే హాస్యాస్ప‌దాంశం మ‌రొక‌టి ఉండ‌దు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి...

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

HOT NEWS

[X] Close
[X] Close