బిగ్ బ్రేకింగ్- కాంగ్రెస్ లోకి 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్?

అధికారం కోల్పోయి, ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో అన్న టెన్ష‌న్ లో ఉన్న కేసీఆర్ కు భారీ షాక్ త‌గ‌ల‌బోతుందా? ఇప్పటికే పార్టీ మారిన‌ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు తోడు మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌బోతున్నారా…?

నేను గేట్లు తెరిస్తే మీరు, మీ కుటుంబ స‌భ్యులు మిన‌హా ఎవ‌రూ మిగ‌ల‌రు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు హెచ్చ‌రించారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే అడుగులు ప‌డుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం, స్టేష‌న్ ఘ‌నపూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని స్వ‌యంగా క‌లిసి వ‌చ్చారు. వారంతా పార్టీ మారే ఉద్దేశంతోనే క‌లిశార‌న్న చ‌ర్చ కూడా పెద్ద ఎత్తున జ‌రిగింది.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ ప్ర‌భుత్వం కూలుతుంద‌ని ప్ర‌తిప‌క్షాల నుండి ప‌దే పదే విమ‌ర్శ‌లు వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్ చేరిక‌ల స్పీడ్ పెంచింది. త్వ‌ర‌లోనే ప్ర‌తిప‌క్ష హోదా కూడా పోతుంద‌ని మంత్రులు ఘాటుగా విమ‌ర్శించ‌గా, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లోనే ఎంత మంది పార్టీ మార‌బోతున్నారో ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది.

మీ పార్టీ లో ఎవ‌రూ మిగ‌ల‌రు… త్వ‌ర‌లోనే మీ పార్టీ నుండి 20-25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. 104మంది ఎమ్మెల్యేలున్న మీ పార్టీని జ‌నం బొంద‌పెడితే 39కి వ‌చ్చార‌ని… ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో కూడా 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌బోతున్న‌ట్లు ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. దీంతో పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవ‌రన్న చ‌ర్చ ఊపందుకుంది.

ఖ‌మ్మం నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు ఇప్ప‌టికే కాంగ్రెస్ గూటికి చేర‌గా, మెద‌క్ జిల్లా నుండి ప‌లువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని క‌లిశారు. గ్రేట‌ర్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close