రేవంత్ మ‌ద్ద‌తుదారుల నోటికి ఉత్త‌మ్ తాళం..!

పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫుల్ గుస్సాతో ఉన్నారు! ఎంపీ రేవంత్ రెడ్డితో మొద‌లైన కోల్డ్ వార్ ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతోంది. కొత్త పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ కి అవ‌కాశాలుండ‌టంతో ఉత్త‌మ్ ఆగ్ర‌హించ‌డం మొద‌లుపెట్టారు. అధిష్టానం ద‌గ్గ‌ర‌కి వెళ్లి, హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక అయ్యే వ‌ర‌కూ త‌న‌ని మార్చొద్దంటూ విన్న‌వించుకున్నారు. అంతేకాదు, ఢిల్లీ పెద్ద‌లెవ్వ‌రూ కొన్నాళ్ల‌పాటు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వొద్ద‌ని కూడా చెప్పార‌ని స‌మాచారం. అక్క‌డితో ఆగ‌ట్లేదు… రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్న‌వారి నోటికి తాళం వేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ మీడియాలో క‌నిపించ‌కూడ‌దు! టీవీ ఛానెళ్లు పెడుతున్న చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌కూడ‌దు, ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌కూడ‌దంటూ పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఏఐసీసీ నుంచి వ‌చ్చిన ఆదేశం అని కొంత‌మంది నాయ‌కులు చెబుతున్నా… ఇది పూర్తిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్య‌క్తిగ‌త ఆదేశాల మేర‌కే వెలువ‌డ్డ ప్ర‌క‌ట‌న‌గా తెలుస్తోంది. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ భార్యని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంపై రేవంత్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ త‌రువాత‌, రేవంత్ కి మ‌ద్ద‌తుగా కొంత‌మంది మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు! ఓ టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో పీసీసీ నాయ‌కుడు మాన‌వ‌తారాయ్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల నాయ‌కుడ‌నీ, ఆయ‌న‌కి పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలో ఎవ్వ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలుండ‌వ‌ని వ్యాఖ్యానించారు. ఇలానే మ‌రికొంద‌రు వివిధ ఛానెల్స్ లో మాట్లాడుతున్నారు. ఇవ‌న్నీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కోపం తెప్పించాయ‌ట‌! అందుకే మీడియాలో చ‌ర్చ‌ల‌కు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ అయిన‌ట్టు తెలుస్తోంది.

హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక ఉంది, త్వ‌ర‌లోనే మున్సిపోల్స్ ఉన్నాయి, ఈ నేప‌థ్యంలో మీడియా చ‌ర్చ‌ల్లో కాంగ్రెస్ వాయిస్ లేకపోతే ఎలా అని సొంత పార్టీకి చెందిన కొంద‌రు తాజా ఆదేశాల‌పై గుర్రుగా ఉన్నారు. ఇప్ప‌టికే పార్టీ సంక్షోభంలో ఉంద‌నీ, ఇలాంటి ఆదేశాల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత దూరం అవుతామ‌నీ, ఈ ప‌రిస్థితి భాజ‌పా పూర్తిగా అనుకూలంగా మార్చేసుకుంటుంద‌ని అంటున్నారు. పీసీసీ ఆదేశాల‌పై రేవంత్ రెడ్డి స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి. కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఉన్న త‌న‌కు తెలియ‌కుండా నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయ‌న్న ఆవేద‌న‌లో ఆయ‌న ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీకి ట‌చ్ లోకి వెళ్తారా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close