గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే. చిరుత‌… వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో చేయించారు. రెండో సినిమా `మ‌గధీర‌` గీతా ఆర్ట్స్ లో వ‌చ్చింది. సాయిధ‌ర‌మ్ తేజ్ తొలి సినిమా `రేయ్‌`… వైవిఎస్ చౌద‌రి నిర్మించాడు. రెండో సినిమా `పిల్లా నువ్వు లేని జీవితం` గీతా ఆర్ట్స్‌లో వ‌చ్చింది. అల్లు శిరీష్ విష‌యంలోనూ ఇంతే. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌కీ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా `ఉప్పెన‌` విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెండో సినిమా మాత్రం గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఫిక్స‌య్యింది. ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని ఈసినిమాతో ప‌రిచయం చేయ‌బోతోంది గీతా ఆర్ట్స్‌. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంది. `ఉప్పెన‌` విడుద‌ల త‌ర‌వాతే.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close