అభిమానుల‌కు మ‌హేష్ విన్న‌పం

ఆగ‌స్టు 9 మ‌హేష్‌బాబు పుట్టిన రోజు. సోష‌ల్ మీడియాలో… మ‌హేష్ బాబు అభిమానుల సంబ‌రాలు ఎప్పుడో మొద‌లైపోయాయి. ఆగ‌స్టు 9న ఆ సంద‌డి రెట్టింపు కానుంది. అయితే… త‌న పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని మ‌హేష్‌బాబు అభిమానుల‌కు ఓ విన్న‌పం చేశాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో.. వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని, అభిమానులు ఇంటి ద‌గ్గ‌రే ఉండాల‌ని సూచించాడు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న చేశాడు మ‌హేష్‌.

”మీరంద‌రూ నాకు తోడుగా ఉండ‌డం నా అదృష్టం. నా పుట్టిన రోజు ప్ర‌త్యేకంగా ఉండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో సుర‌క్షితంగా ఉండ‌డ‌మే అన్నింటికంటే ముఖ్యం. కాబ‌ట్టి.. ఇంటి ద‌గ్గ‌రే ఉండండి. సుర‌క్షితంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. మ‌హేష్ కూడా త‌న పుట్టిన రోజుని చాలా సింపుల్‌గా చేసుకోవాల‌ని భావిస్తున్నాడు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో కుటుంబంతోనే గ‌డుపుతున్నాడు మ‌హేష్‌. ఈ పుట్టిన రోజునీ.. మ‌హేష్ త‌న కుటుంబానికే కేటాయించ‌బోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

పారితోషికాల త‌గ్గింపు.. పెద్ద జోక్‌

ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ''బ‌డా స్టార్లు పారితోషికాలు త‌గ్గించుకోవాలి..'' అని. త‌రాలు మారినా, ప‌రిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మార‌లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోలేదు.. నిర్మాత‌లు త‌గ్గించి ఇచ్చిన...

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

HOT NEWS

[X] Close
[X] Close