వైష్ణ‌వ్ తేజ్‌… ‘రంగ రంగ వైభ‌వంగ‌…!’

ఉప్పెన‌తో ఎంట్రీ ఇచ్చిన మ‌రో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `కొండపొలెం` నిరాశ ప‌రిచినా, ఆ ఎఫెక్ట్ వైష్ణ‌వ్ కెరీర్‌పై ప‌డ‌లేదు. న‌టుడిగా త‌న‌కు మంచి మార్కులే వ‌చ్చాఇ. ఇప్పుడు మూడో సినిమా మొద‌లెట్టేస్తున్నాడు. వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఎస్‌.వి.సి.సి సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గిరీశ‌య్య‌ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌క‌టిస్తాన‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఈ సినిమాకి `రంగ రంగ వైభ‌వంగ‌` అనే టైటిల్ ఫిక్స‌యిన‌ట్టు స‌మాచారం. అధికారికంగా రేపు ప్ర‌క‌టిస్తారు. కితిక శ‌ర్మ క‌థానాయిక‌. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గిరీశ‌య్య‌కి ఇది రెండో సినిమా. త‌ను అర్జున్ రెడ్డికి కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. అర్జున్ రెడ్డి త‌మిళంలో రీమేక్ చేసింది గిరీశ‌య్య‌నే. తెలుగులో త‌న‌కు ఇది తొలి సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు రేపు వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...
video

”థ్యాంక్ యూ” టీజర్.. చైతు ప్రయాణం

https://www.youtube.com/watch?v=t5NPiPtZ8PY నాగచైతన్య- విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. 'నా విజయానికి నేనొక్కడినే కారణం' అనే హీరో డైలాగ్ తో ఓపెన్ అయన టీజర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close